అసదుద్దీన్ పై రాజా సింగ్ సంచలన ఆరోపణలు
- IndiaGlitz, [Sunday,September 01 2019]
గోష మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ ఆసక్తిగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అసోం లో అమలు చేసిన ఎన్ ఆర్ సి ని తెలంగాణలోనూ అమలు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓటు బ్యాంక్ ను పెంచుకునే ప్రయత్నంలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు తెలంగాణలో చోటు ఇస్తున్నారని ఆరోపించారు. దీన్ని అరికట్టేందుకు అసోం లో అమలు చేసిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్ ను అమలు చేయాలని కోరారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రోజు నుంచి దీన్ని అమలు చేయాలని అమిత్ షాను సోషల్ మీడియా వేదికగా కోరారు రాజా సింగ్.