16న 'రాజా మీరు కేక'
Send us your feedback to audioarticles@vaarta.com
గుంటూరు టాకీస్ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్‌పై రేవంత్, నోయల్, హేమంత్, లాస్య, శోభిత ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'రాజా మీరు కేక'. కృష్ణ కిషోర్ దర్శకత్వంలో రాజ్‌కుమార్.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది.
హేమంత్ మాట్లాడుతూ ..మా రాజా మీరు కేక సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ నలుగురు స్నేహితులు వారికి ఎదురైన సమస్యను ఎలా తెలివిగా ఎదుర్కొన్నారనే కథాంశంతో రూపొందింది. నా క్యారెక్టర్ చాలా ఫన్‌తో సాగుతుందని తెలిపారు.
లాస్య మాట్లాడుతూ..ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు మధ్య నడిచే స్నేహన్ని తెలియజేసే చిత్రమిది. తప్పకుండా ఎంటర్‌టైనింగ్‌గా, ఆసక్తికరంగా సాగుతుందని లాస్య అన్నారు.
దర్శకుడు కిషోర్‌గారు ఒక ఫిక్షన్‌ను, రియాల్టిటీని మిక్స్ చేసి సినిమాను తెరకెక్కించారు. నలుగురు స్నేహితులు మధ్య నడిచే కథ. విలన్‌గా తారకరత్న నటించారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుందని రేవంత్ చెప్పారు. మంచి క్యారెక్టర్ చేశానని హేమంత్ చెప్పారు. ఓ కొత్త ప్రయత్నం. అందరి సపోర్ట్‌తో సినిమాను చక్కగా తీశాం. ఈ నెల 16న సినిమా విడుదలవుతుంది. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నానని దర్శకుడు కృష్ణ కిషోర్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments