రాజా చెయ్యివేస్తే...కథ రొటీన్ గా ఉన్నా...స్ర్కీన్ ప్లే కొత్తగా ఉంటుంది - నారా రోహిత్
- IndiaGlitz, [Thursday,April 28 2016]
నారా రోహిత్ కథానాయకుడుగా - నందమూరి తారకరత్న ప్రతినాయకుడుగా రూపొందిన చిత్రం రాజా చెయ్యివేస్తే. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 29న ఈ చిత్రాన్నిరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు నారా రోహిత్ తో ఇంటర్ వ్యూ మీకోసం..
తుంటరి, సావిత్రి..ఈ రెండు చిత్రాల రిజల్ట్స్ గురించి మీ రెస్పాన్స్ ఏమిటి..?
తుంటరి సినిమాకి మేము అనుకున్నది సాధించాం. ఈ సినిమాకి వచ్చిన ఫీడ్ బ్యాక్ మాకు సంతృప్తి కలిగించింది. అయితే..సావిత్రి సినిమాకి ఇంకా ఎక్కువ స్పందన వస్తుందని ఆశించాం. కానీ...ఎందుకనో మేము ఆశించిన స్పందన రాలేదు.
సావిత్రి సినిమాకి మీరు ఆశించిన విజయం రాకపోవడానికి కారణం ఏమిటి..?
ఒక సినిమా సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. సావిత్రి మేము ఆశించిన స్ధాయిలో సక్సెస్ కాకపోవడానికి కారణం ఏమిటో తెలియదు. అసలు ఎందుకు ఇలా జరిగిందో ఆలోచించడానికి టైమ్ కూడా లేదు.
మీరు వరుసగా సినిమాలు చేస్తూ...నెలకో సినిమా రిలీజ్ చేయడం వలన క్వాలిటీ తగ్గి సరైన సక్సెస్ రావడం లేదంటారా..?
సంవత్సరానికి ఓ సినిమా చేస్తే...ఇయర్ కి 1 సినిమానేనా..? అంటారు. వరుసగా సినిమాలు చేస్తుంటే...వరుసగా సినిమాలు చేయడానికి కారణం ఏమైనా ఉందా..? అని అడుగుతున్నారు..(నవ్వుతూ..) సంవత్సరానికి 1 సినిమా చేస్తే..ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటే సంవత్సరానికి ఒక సినిమానే చేస్తాను.కానీ..అలా జరగదు కదా..అయినా నేను ఎక్కువ సినిమాలు చేయడం వలన చాలా మందికి పని కల్పించినట్టు అవుతుంది అనుకుంటున్నాను. ఇక క్వాలిటీ అంటారా..నా సినిమాలో ఏ విషయంలోనైనా సరే...మంచి క్వాలిటీతో ఉంటుంది. క్వాలిటీ విషయంలో కామ్ ప్రమైజ్ కాను.
ఇక రాజా చెయ్యివేస్తే...విషయానికి వస్తే...ఈ మూవీ కథ ఏమిటి..?
కథ ఏమిటనేది చెప్పేస్తే..ఆడియోన్స్ థ్రిల్ మిస్ అవుతారు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను కథ రొటీన్ గా ఉన్నా...స్ర్కీన్ ప్లే కొత్తగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందో అని ఇంట్రస్టింగ్ గా చూసేలా ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఉండే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.
మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నా క్యారెక్టర్ పేరు రాజారామ్. ఈ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ చేసాను. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది.
రాజా చెయ్యివేస్తే...టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి...?
నా క్యారెక్టర్ పేరు రాజారామ్. అలాగే రాజా చెయ్యివేస్తే...పాపులర్ సాంగ్ పైగా...క్యాచీగా కూడా ఉంటుందని రాజా చెయ్యివేస్తే..అనే టైటిల్ పెట్టాం.
డైరెక్టర్ ప్రదీప్ కి ఫస్ట్ ఫిల్మ్ కదా..వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది..?
ప్రదీప్ టెక్నీకల్ గా చాలా స్ట్రాంగ్. ప్రతి విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాడు. తనకు కావాల్సింది వచ్చే వరకు రాజీపడడు. డైలాగ్ డిక్షన్ పై కూడా ప్రదీప్ కి బాగా పట్టు ఉంది.
ఈ ప్రాజెక్ట్ లోకి ముందు మీరు వచ్చారా..? తారకరత్న వచ్చారా..?
ముందు తారక్ వచ్చారు. ఆతర్వాతే నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. తారక్ ఈ సినిమా చేయడం వలన ఈ ప్రాజెక్ట్ కి హైప్ వచ్చింది. తను చేయకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు.
మీ లుక్ లో ఛేంజ్ కనిపిస్తుంది..? వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తున్నారా..?
అవునండీ..ఇప్పటి వరకు 5 కిలోలు తగ్గాను. జూన్ నుంచి ప్రారంభం అయ్యే సినిమాలో నా లుక్ లో ఇంకా ఛేంజ్ కనిపిస్తుంది.
కథలో రాజకుమారి ప్రొగ్రెస్ ఏమిటి..?
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఇళయరాజా గారు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలకు మంచి ట్యూన్స్ అందించారు. మే నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నాం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
జో అచ్యుతానంద, రాజ కుమారి, అప్పట్లో ఒకడుండేవాడు, పండగలా వచ్చాడు చిత్రాలు చేస్తున్నాను.