సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజా చెయ్యి వేస్తే'

  • IndiaGlitz, [Friday,April 22 2016]

తన నటన, డైలాగ్ డెలివరీతో తొలి సినిమా బాణం సినిమా నుండి నేటి వ‌ర‌కు డిఫ‌రెంట్‌గా చేస్తూ త‌న ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటూ యూత్ లో, ప్యామిలీ ఆడియెన్స్ ఓ క్రేజ్ ను సంపాదించుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం రాజా చెయ్యివేస్తే'. ఈగ', అందాల రాక్షసి','లెజండ్', ఊహలు గుసగుసలాడే', దిక్కులు చూడకు రామయ్యా' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ఈగ'తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ప్రదీప్ చిలుకూరి ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నందరమూరి తారకరత్న విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్, పాటలకు ఆడియెన్స్ నుండి మంచి స్పందనను రాబట్టుకుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాను ఏఫ్రిల్ 29న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.