ప్లాప్ హీరోయిన్‌తో రాజ్ త‌రుణ్‌....

  • IndiaGlitz, [Wednesday,March 20 2019]

రాజ్ త‌రుణ్ పేరు చెప్ప‌గానే ఎవ‌రికైనా ఉయ్యాలా జంపాలా సినిమా గుర్తుకొస్తుంది. అప్ప‌టిదాకా డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్‌లో ప‌నిచేసిన వైజాగ్ కుర్రాడిని అమాంతం హీరోగా చేసిన సినిమా అది. ఆ వెంట‌నే వచ్చిన కుమారి 21ఎఫ్ కూడా రాజ్‌త‌రుణ్ కెరీర్లో చెప్పుకోద‌గ్గ సినిమాగానే నిలిచింది.

అయితే స‌రైన జ‌డ్జిమెంట్ లేకుండా చేసిన స్క్రిప్టుల కార‌ణంగా ఈ మ‌ధ్య రాజ్‌త‌రుణ్ ఫెయిల్యూర్‌లో ఉన్నాడు. దిల్‌రాజు అన్న కొడుకు హ‌ర్షిత్ తెర‌కెక్కించిన ల‌వ‌ర్ కూడా ఆయ‌న‌కు పెద్ద‌గా ప్ల‌స్ కాలేదు. ఈ నేప‌థ్యంలో అదే దిల్‌రాజు కాంపౌండ్‌లో రాజ్‌త‌రుణ్ మ‌రో సినిమా చేయ‌బోతున్నారు. ఓ ట‌ర్కీస్ సినిమాను బేస్ చేసుకుని మినిమం బ‌డ్జెట్‌లో సినిమా చేయ‌డానికి రాజ్‌త‌రుణ్ సిద్ధ‌మ‌వుతున్నాడట‌.

ఈ సినిమాలో హీరోయిన్‌గా మేఘా ఆకాశ్ న‌టించ‌నుంది. తెలుగులో ఈమె న‌టించిన లై, ఛ‌ల్‌మోహ‌న్ రంగ చిత్రాలు ఆశించిన మేర విజ‌యాన్ని సాధించ‌లేదు. మ‌రి ఈసారైనా మేఘా ఆకాశ్‌కు మంచి బ్రేక్ దొరుకుతుందేమో చూడాలి. మ‌రో వైపు రాజ్ త‌రుణ్‌కూడా స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. త‌న‌కి కూడా మంచి బ్రేక్ ద‌క్కాల‌ని ఆశిద్దాం.

More News

నరేశ్ ఒకటో తేదీలోగా డబ్బులు ఖాతాలో వెయ్: శివాజీ రాజా

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ముగిసినప్పటికీ వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం విషయంలో శివాజీ రాజా అడ్డంకులు

నాగబాబుకు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా!

"రిటర్న్ గిఫ్ట్" ఇప్పుడీ పదం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెగ వినిపిస్తోంది. అయితే అది కాస్త టాలీవుడ్‌కూ పాకింది. ఎస్ నాకు గిఫ్ట్ ఇచ్చారు.. నేను కూడా రిటర్న్ గిఫ్ట్

నరేశ్ నీకు ధైర్యముంటే...: శివాజీరాజా

'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ముగిసినప్పటికీ వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రమాణం చేసేందుకుగాను మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా

జనసేన తరఫున ఎంపీగా మాజీ జేడీ పోటీ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈయన్ను విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా జనసేన అధిష్టానం ప్రకటించింది.

'లక్ష్మిస్ ఎన్టీఆర్' రిలీజ్‌కు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మిస్ ఎన్టీఆర్'.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెరకెక్కించిన 'లక్ష్మీస్ వీర గ్రంథం' సినిమాల విడుదలను ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.