'అలా ఎలా' దర్శకుడితో రాజ్ తరుణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఉయ్యాల జంపాల చిత్రంతో కథానాయకుడిగా తెరంగేట్రం చేశాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్. ఆ తరువాత సినిమా చూపిస్త మామ, కుమారి 21 ఎఫ్ విజయాలతో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. ఆ తరువాత ఒకట్రెండు సక్సెస్ఫుల్ మూవీస్తో సందడి చేసిన ఈ యంగ్ హీరో.. అతి త్వరలో అలా ఎలా చిత్ర దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారమ్. నవంబర్లో ఈ సినిమా ప్రారంభం కానుందట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడతాయి. ప్రస్తుతం రాజ్ తరుణ్.. సంజనా రెడ్డి దర్శకత్వంలో రాజు గాడు అనే సినిమా చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments