రచయితగా మారిన రాజ్ తరుణ్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో రాజ్‌తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను మార్చి 3న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 2016లో హిట్ అయిన చిత్రాల్లో `ఈడోరకం-ఆడోరకం` తర్వాత ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రాజ్‌తరుణ్ నటిస్తున్న మరో చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.
ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ కుక్కలను కిడ్నాప్ చేసే యువకుడిగా పాత్రలో కనపడనున్నారు. డబ్బు కోసం కుక్కలను కిడ్నాప్ చేయడమే కాకుండా, ప్రేమ కోసం రాజ్‌తరుణ్ ఏం చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అనేక మలుపులతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజై ట్రెమెండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్న సంగతి తెలిసిందే.
యంగ్ మ్యూజిక్ ఢైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు మార్కెట్లోకి విడుదలవుతూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటున్నాయి. ప్రేమికుల రోజున విడుదలైన అర్థమైందా... . అనే పాటకు ప్రేక్షకులను సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ చార్ట్స్‌లో ముందు వరుసలో నిలుచుకుంది. తాజాగా హీరో రాజ్‌తరుణ్ ఈ సినిమా కోసం పాటల రచయితగా అవతారం ఎత్తాడు. `జానీ జానీ..` అంటూ సాగే ఈ పాట కోసం రాజ్‌తరుణ్ సాహిత్యం అందించడం విశేషం.
గౌతమిపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ సినిమాకు సంభాషణలు రాసిన రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు ఫన్నీ డైలాగ్స్‌ను అందించారు. రాజ్‌తరుణ్ సరసన అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. అలాగే హంసానందిని స్పెషల్ సాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ కానుంది.
రాజ్‌తరుణ్, అను ఇమ్మాన్యుయల్, నాగబాబు, పృథ్వీ, రఘుబాబు, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, ప్రవీణ్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథః శ్రీకాంత్ విస్సా, డైలాగ్స్ః సాయిమాధవ్ బుర్రా, ఎడిటర్ః ఎం.ఆర్.వర్మ, ఆర్ట్ః అవినాష్, కెమెరాః బి.రాజశేఖర్, సహ నిర్మాతః అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః కిషోర్ గరికపాటి, మ్యూజిక్ః అనూప్ రూబెన్స్, నిర్మాతః రామబ్రహ్మం సుంకర, దర్శకత్వంః వంశీకృష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments