విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా: రాజ్ తరుణ్
- IndiaGlitz, [Friday,June 14 2019]
రీసెంట్గా సోషల్ మీడియా చాట్‌లో తాను ప్రేమ వివాహం చేసుకుంటున్నానని, త్వరలోనే తన పెళ్లి కబురు చెబుతానని హీరో రాజ్‌తరుణ్ తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ''నేను ప్రేమిస్తున్న అమ్మాయిది విజయవాడ. ఇద్దరం ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. తను వ్యాపారవేత్త. తెలుగు అమ్మాయే. ఇప్పుడే అందరి దృష్టిలో పడటం తనకు ఇష్టం లేదు. తన అభిప్రాయాలపై ఉన్న గౌరవంతో ఆమె పేరు చెప్పాలనుకోవడం లేదు.
మా ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నేను పెళ్లికి సిద్ధంగానే ఉన్నా.. వచ్చే ఏడాదే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఆరేళ్ల క్రితం వైజాగ్‌లో జరిగిన నా పుట్టినరోజు వేడుకల్లో ఆమెను కలిశాను. అలా ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి అభిరుచులు కలిశాయి. ఇద్దరం ఒకరికొకరు అనే ఫీలింగ్‌లో ఉన్నాం. ఇక ప్రొఫెషనల్‌గా నా పనెంటో ఆమెకు తెలుసు. ఆమెకు నాపై నమ్మకం ఉంది'' అన్నారు.