ఆర్జీవి పై రాజ్ త‌రుణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • IndiaGlitz, [Friday,November 06 2015]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ లో ఏదో సంచ‌ల‌న ట్వీట్ చేస్తుండ‌డం చూసాం. ఇప్పుడు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ పైనే సెన్సేష‌నల్ కామెంట్స్ చేసాడు ఓ యంగ్ హీరో. ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఉయ్యాలా జంపాల‌, సినిమా చూపిస్త మామ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన రాజ్ త‌రుణ్‌.

ఇంత‌కీ రాజ్ త‌రుణ్ ట్విట్ట‌ర్ లో ఏమ‌న్నాడంటే...వ‌ర్మ తో సినిమా చేస్తున్నాను. కానీ వ‌ర్మ ప్ర‌స్తుతం జ‌స్ట్ ఓకె ఓకె డైరెక్ట‌ర్. త‌ను డైరెక్ట‌ర్ అయితే రంగీల‌, శివ క‌న్నా బెట‌ర్ గా సినిమా చేయ‌గ‌ల‌నంటున్నాడు. రాజ్ త‌రుణ్ ట్వీట్స్ పై వ‌ర్మ స్పందిస్తూ...రాజ్ త‌రుణ్ డైరెక్ట‌ర్ అయితే త‌న క‌న్నా పూరి, వినాయ‌క్, రాజ‌మౌళి క‌న్నా బెట‌ర్ డైరెక్ట‌ర్ అవుతాడు అన‌డం విశేషం.