రాజ్ తరుణ్ 'రంగుల రాట్నం' ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది
Send us your feedback to audioarticles@vaarta.com
2017లో 'రారండోయ్ వేడుక చూద్దాం', 'హలో' వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'రంగుల రాట్నం' చిత్రం ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది. రాజ్ తరుణ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ టోటల్‌గా పూర్తయింది. ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 'ఉయ్యాలా జంపాలా' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ మళ్ళీ రాజ్ తరుణ్‌తో చేస్తున్న 'రంగుల రాట్నం' సంక్రాంతి రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
రాజ్‌తరుణ్, చిత్రా శుక్లా, సితార, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: ఎల్.కె.విజయ్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఆర్ట్: పురుషోత్తం ఎం., నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్, దర్శకత్వం: శ్రీరంజని.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com