మే 11న 'రాజుగాడు' విడుదల

  • IndiaGlitz, [Friday,March 23 2018]

రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం రాజుగాడు. సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోంది. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై విశేషమైన ఆదరణ చూరగొనడంతోపాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ మా బ్యానర్ లో చేస్తున్న నాలుగో చిత్రమిది. సంజనా రెడ్డి చాలా చక్కగా తెరకెక్కించింది. హీరో క్యారెక్టరైజేషన్, రాజేంద్రప్రసాద్ గారి కామెడీ ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. విడుదలైన టీజర్ మరియు పోస్టర్స్ కి మంచి స్పందన లభించింది. మే 11న చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటున్నాం. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం. మా బ్యానర్ లో రాజుగాడు మరో హిట్ సినిమాగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.

రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావురమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యుమ్, అదుర్స్ రఘు, అభి ఫిష్ వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్, మూల కథ: మారుతి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, స్టిల్స్: రాజు, మేకప్: రామ్గా, కాస్ట్యూమ్స్: శివ-ఖాదర్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్-రియల్ సంతోష్, కొరియోగ్రఫీ: రఘు-విజయ్, ఆర్ట్: కృష్ణ మాయ, చీఫ్ కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రాఫర్: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర-డా.లక్ష్మారెడ్డి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంజనా రెడ్డి. 

More News

మహానటి షూటింగ్ పూర్తి

కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం "మహానటి". లజండరీ కథానాయకి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్

ఆ లిస్ట్‌లో ఉపేంద్ర మాధ‌వ్ చేరుతాడా?

కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించ‌డం.. వాళ్ళ‌తో సినిమాలు చేసి, విజ‌యాల‌ను అందుకోవ‌డం క‌ళ్యాణ్‌రామ్‌కు కొత్తేం కాదు.

'ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం

జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం

రెండోసారి కూడా అలాగే..

హైప‌ర్‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ఫ‌లితాల‌తో నిరాశ‌పడ్డ యువ క‌థానాయ‌కుడు రామ్‌.. త‌దుప‌రి చిత్రాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

చంద్ర‌బాబు చేతుల మీదుగా జొన్న‌విత్తుల ప‌ద్య వాద్య క‌చేరి విడుద‌ల‌

తెలుగు పదాలకు పద్యాలకు వన్నె తెచ్చిన కవులు మన చరిత్రలో చాలా మందే వున్నారు.