నాకు దెబ్బలేమీ తగల్లేదు.. ఎందుకు పరిగెత్తానంటే.. రాజ్ తరుణ్

  • IndiaGlitz, [Wednesday,August 21 2019]

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌కి పెను ప్రమాదం నుంచి బయటపడ్డ విషయం విదితమే. మంగళవారం తెల్లవారు జామున ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగి అల్కాపూర్ వద్దనున్న ఔటర్ రింగురోడ్డులో ప్రెద్ద ప్రమాదానికి గురవ్వడంతో రాజ్‌తరుణ్ బెలూన్స్ తెరుచుకోవడంతో రాజ్‌తరుణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రాజ్ తరుణ్.. తాజాగా అన్ని వివరాలను తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

నేను అదృష్టవంతుడ్ని!

నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి చాలామంది కాల్స్ చేస్తున్నారనీ, ఇంత మంది ప్రేమను పొందినందుకు నేను అదృష్టవంతున్ని. నార్సింగి సర్కిల్‌లో గత 3 నెలలుగా చాలా ప్రమాదాలు జరిగాయి. కారు ప్రమాదం అనంతరం నేను అక్కడ్నుంచి ఇంటికి చేరుకున్నాను అని చెప్పుకొచ్చారు.

ఆ రోజు అసలేం జరిగింది..?

నార్సింగి సర్కిల్‌లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నేను కారుపై నియంత్రణ కోల్పోయాను. కారు ఒక్కసారిగా వెళ్లి పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. అప్పుడు వచ్చిన శబ్దానికి నా రెండు చెవులు పనిచేయలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. నాకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డాను. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆరోజు రాత్రి జరిగింది ఇదే. మిగిలిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగులో పాల్గొంటాను. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు. అంటితో ఆగని రాజ్ సీటు బెల్టే ప్రమాదం నుంచి తనను కాపాడిందనీ, సీట్ బెల్ట్ ధరించాలని ఈ సందర్భంగా సూచించారు.

More News

రాయలసీమలో నవ్యాంధ్ర రాజధాని!?

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి రాయలసీమకు షిఫ్ట్ కానుందా..? త్వరలోనే అమరావతికి తూచ్ అని చెప్పేస్తారా..?

ఆరోగ్యం విష‌యంలో అమితాబ్ చేసిన త‌ప్పు

ఆరోగ్యం విష‌యంలో అంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాలంటున్నారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌.

'కౌసల్య కృష్ణమూర్తి' తప్పకుండా హ్యుజ్‌ సక్సెస్‌ సాధిస్తుంది - క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

జేమ్స్ బాండ్ 25వ చిత్రం టైటిల్ ఖ‌రారు

జేమ్స్ బాండ్ చిత్రాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంటాయ‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు హీరోలు జేమ్స్ బాండ్‌లుగా న‌టించి మెప్పించారు.

నవంబర్‌ 30న 'లెజెండ్స్‌' లైవ్‌ కాన్సర్ట్‌

కె.జె. ఏసుదాస్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెయస్‌ చిత్ర లాంటి లెజెండరీ సింగర్స్‌ తో ఎలెవన్‌ పాయింట్‌టు మరియు బుక్‌ మై షో సంయుక్తంగా ‘లెజెండ్స్‌’