గీతా ఆర్ట్స్ లో రాజ్ తరుణ్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్త మామ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ చిత్రంతో హ్యాట్రిక్ సాధించడానికి వస్తున్నాడు. ఈ నెల 20న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం తర్వాత రాజ్ తరుణ్ వంశీ డైరెక్షన్ లో ఓ మూవీ, హీరో విష్ణుతో కలసి ఓ మూవీ, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూడు చిత్రాలతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కూడా రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని రాజ్ తరుణ్ కన్ ఫర్మ్ చేసాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే చిత్రంలో నటిస్తానని చెప్పాడు. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించనున్నారు. వరుస విజయాలు సాధిస్తూ..ఫుల్ బిజీగా ఉన్న రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ తో హ్యాట్రిక్ సాధిస్తాడని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com