రాజ్ తరుణ్ న్యూ మూవీ
Send us your feedback to audioarticles@vaarta.com
రాజ్ తరుణ్ పేరు చెప్పగానే ఎవరికైనా ఉయ్యాలా జంపాలా సినిమా గుర్తుకొస్తుంది. అప్పటిదాకా డైరక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేసిన వైజాగ్ కుర్రాడిని అమాంతం హీరోగా చేసిన సినిమా అది. ఆ వెంటనే వచ్చిన కుమారి 21ఎఫ్ కూడా రాజ్‌తరుణ్ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాగానే నిలిచింది.
అయితే సరైన జడ్జిమెంట్ లేకుండా చేసిన స్క్రిప్టుల కారణంగా ఈ మధ్య రాజ్‌తరుణ్ ఫెయిల్యూర్లో ఉన్నాడు. దిల్‌రాజు అన్న కొడుకు హర్షిత్ తెరకెక్కించిన లవర్ కూడా ఆయనకు పెద్దగా ప్లస్ కాలేదు. ఈ నేపథ్యంలో అదే దిల్‌రాజు కాంపౌండ్‌లో రాజ్‌తరుణ్ మరో సినిమా చేయబోతున్నారు. 'మీరుకనుక నాతో ఏడాదికి ఒక సినిమా చేస్తానంటే బయట నిర్మాతలకు కాల్షీట్లు ఇవ్వను' అని లవర్ ఆడియో వేడుక మీద దిల్రాజును ఉద్దేశించి చెప్పాడు రాజ్‌తరుణ్.
చూస్తుంటే ఆ మాట నిజమేనని అనిపిస్తోంది. లవర్ తర్వాత రాజ్‌తరుణ్ మరే సినిమా చేయలేదు. ఇప్పుడు రాజ్‌తరుణ్ హీరోగా దిల్‌రాజు సంస్థలో ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాకు ఆడు మగాడ్రా బుజ్జీ దర్శకుడు ఆర్కే దర్శకత్వం వహించనున్నారు. మార్చి మూడో వారంలో ఈ సినిమాకు శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ రిలీజ్‌కు ప్లానింగ్స్ జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments