రాజ్ త‌రుణ్ న్యూ మూవీ

  • IndiaGlitz, [Monday,March 04 2019]

రాజ్ త‌రుణ్ పేరు చెప్ప‌గానే ఎవ‌రికైనా ఉయ్యాలా జంపాలా సినిమా గుర్తుకొస్తుంది. అప్ప‌టిదాకా డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్‌లో ప‌నిచేసిన వైజాగ్ కుర్రాడిని అమాంతం హీరోగా చేసిన సినిమా అది. ఆ వెంట‌నే వచ్చిన కుమారి 21ఎఫ్ కూడా రాజ్‌త‌రుణ్ కెరీర్లో చెప్పుకోద‌గ్గ సినిమాగానే నిలిచింది.

అయితే స‌రైన జ‌డ్జిమెంట్ లేకుండా చేసిన స్క్రిప్టుల కార‌ణంగా ఈ మ‌ధ్య రాజ్‌త‌రుణ్ ఫెయిల్యూర్‌లో ఉన్నాడు. దిల్‌రాజు అన్న కొడుకు హ‌ర్షిత్ తెర‌కెక్కించిన ల‌వ‌ర్ కూడా ఆయ‌న‌కు పెద్ద‌గా ప్ల‌స్ కాలేదు. ఈ నేప‌థ్యంలో అదే దిల్‌రాజు కాంపౌండ్‌లో రాజ్‌త‌రుణ్ మ‌రో సినిమా చేయ‌బోతున్నారు. 'మీరుక‌నుక నాతో ఏడాదికి ఒక సినిమా చేస్తానంటే బ‌య‌ట నిర్మాత‌ల‌కు కాల్షీట్లు ఇవ్వ‌ను' అని ల‌వ‌ర్ ఆడియో వేడుక మీద దిల్‌రాజును ఉద్దేశించి చెప్పాడు రాజ్‌త‌రుణ్‌.

చూస్తుంటే ఆ మాట నిజ‌మేన‌ని అనిపిస్తోంది. ల‌వ‌ర్ త‌ర్వాత రాజ్‌త‌రుణ్ మ‌రే సినిమా చేయ‌లేదు. ఇప్పుడు రాజ్‌త‌రుణ్ హీరోగా దిల్‌రాజు సంస్థ‌లో ఓ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఈ సినిమాకు ఆడు మ‌గాడ్రా బుజ్జీ ద‌ర్శ‌కుడు ఆర్కే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. మార్చి మూడో వారంలో ఈ సినిమాకు శ్రీకారం చుట్ట‌నున్నారు. డిసెంబ‌ర్ రిలీజ్‌కు ప్లానింగ్స్ జ‌రుగుతున్నాయి.

More News

షియోమీ ఎంఐ- 9 హిట్టా.. ఫట్టా.. రివ్యూ

స్మార్ట్‌ఫోన్‌ విపణిలో దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్ సహా ఇతర దిగ్గజ సంస్థలకు దీటుగా విక్రయాలను చేస్తున్న చైనా సంస్థ షియోమీ తాజాగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారత్

బాబుకు తలనొప్పిగా తోట బ్రదర్స్.. జంప్ కన్ఫామా!?

తూర్పు గోదావరి జిల్లాలో తోట బ్రదర్స్‌‌కు జనాల్లో ఉన్న పేరు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తోట నరసింహులు ఎంపీగా, తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా గెలిచి నిలిచారు.

సింహ‌పురి చేరిన జ‌న‌సేనాని పోరాట యాత్ర

జ‌న‌సేన పోరాట యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా ప‌ర్యట‌న ముగించుకున్న ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాలో రెండో రోజు ప‌ర్యట‌న‌లో భాగంగా ఆదివారం

బ్రేకింగ్: మసూద్ అజర్ ఖతం హోగయా..!?

అవును మీరు వింటున్నది నిజమే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజర్ ఖతం హోగయా..!?

సంచలనం: ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు.. ఆయనే సీఎం

తెలంగాణలో పూర్తిగా గాలిపోయిన ‘సైకిల్’కు పంచర్లు వేసి నడిపేందుకు అధిష్టానం సిద్ధమైందా..?