పాటలు పాడుకుంటోన్న రాజ్ తరుణ్
Send us your feedback to audioarticles@vaarta.com
తొలిచిత్రం ఉయ్యాలా జంపాలా`తో విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. తాజాగా సినిమా చూపిస్తా మామ`తో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ కొట్టిన రాజ్‌తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం చిక్‌మంగళూర్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.శైలేంద్రబాబు, శ్రీధర్‌రెడ్డి కేవీ, హరీష్.డి. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు.
ప్రస్తుతం చిక్‌మంగళూర్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ పాత్ర వైవిధ్యంగా వుంటుంది. నేటి యువతరానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. ప్రస్తుతం చిక్‌మంగళూర్‌లో రాజ్‌తరుణ్, నాయిక ఆర్తనలపై రామజోగయ్య శాస్త్రి రచించిన ఓ పాటను గణేష్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 30వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో మరో పాటను కూడా చిత్రీకరిస్తాం.దీంతో తొంభై శాతం షూటింగ్ పూర్తవుతుంది.
తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది` అని తెలిపారు. రాజ్ తరుణ్, ఆర్తన జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజారవీంద్ర, సురేఖావాణి, షకలక శంకర్, మధు, జోగినాయుడు, శ్రీలక్ష్మీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: విశ్వ, సమర్పణ: శ్రీమతి పూర్ణిమ, ఎస్.బాబు, నిర్మాతలు: ఎస్.శైలేంద్రబాబు, శ్రీధర్‌రెడ్డి కెవీ, హరీష్.డి, కథస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com