ఏప్రిల్ 18 నుంచి రాజ్ తరుణ్ కొత్త చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యువ కథానాయకుడు రాజ్ తరుణ్. చిన్న సినిమాలతో పెద్ద విజయాలను అందుకున్న ఈ యంగ్ హీరో.. పలు దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డారు.
అయితే గత కొంత కాలంగా విజయాలకు దూరమయ్యారు రాజ్ తరుణ్. ఈ ఏడాది మాత్రం వరుస సినిమాలు చేస్తున్న నేపథ్యంలో.. తప్పకుండా విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు రాజ్ తరుణ్.
ఈ క్రమంలో 'కుమారి 21 ఎఫ్' తో విజయాన్ని అందించిన పల్నాటి సూర్య ప్రతాప్‌తో మరో సినిమాను చేయబోతున్నారు ఈ యువ హీరో. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 18 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
రవితేజ 'నేల టికెట్టు' సినిమాను నిర్మిస్తున్న రామ్ తాళ్లూరి.. ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను కూడా నిర్మిస్తున్నారు. కథానాయికతో పాటు మిగిలిన టీమ్ సభ్యుల వివరాలను కూడా త్వరలోనే వెల్లడించనున్నారు.
ఇదిలా ఉంటే.. రాజ్‌తరుణ్ నటించిన 'రాజుగాడు' మే 11న విడుదల అవుతుండగా.. జూన్ 14న 'లవర్' మూవీ రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com