జనవరిలో మూవీ రిలీజ్ ప్లాన్ లో రాజ్ తరుణ్...

  • IndiaGlitz, [Friday,December 04 2015]

ఉయ్యాలా జంపాలా మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్. తొలి చిత్రంతోనే విజ‌యం సాధించి అంద‌రి ద్రుష్టి ఆక‌ర్షించిన రాజ్ త‌రుణ్ మ‌లి చిత్రం సినిమా చూపిస్త మామ తో కూడా విజ‌యం సాధించాడు. తాజాగా కుమారి 21 ఎఫ్ మూవీతో హ్యాట్రిక్ సాధించిన రాజ్ త‌రుణ్ జ‌న‌వ‌రిలో సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు అనే మూవీ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు.

ఈ చిత్రాన్ని శ్రీనివాస్ గ‌విరెడ్డి తెర‌కెక్కించారు. పూర్ణిమ ఎస్.బాబు ఈ మూవీని నిర్మించారు. జ‌న‌వ‌రి 7న సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి...ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మామ‌, కుమారి 21 ఎఫ్ చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన రాజ్ త‌రుణ్ సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు మూవీతో డ‌బుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చూడ‌తాడేమో చూడాలి.

More News

బెంగాల్ టైగర్ 100% హిట్ కాదు 101% హిట్ - మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్.సంపత్ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్నినిర్మించారు. ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా బెంగాల్ టైగర్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

వర్మ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’విడుదలకు ముందు సమస్యలను ఫేస్ చేసింది.

చెన్నై కోసం జోలె పట్టిన హీరో

నేను పుట్టింది ఇక్కడే అయినా చెన్నైలోనే పుట్టి పెరిగాను.

మహేష్ ను దాటేసిన ఎన్టీఆర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో.రివేజండ్ డ్రామాతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.

డిక్టేటర్ కి అంత డిమాండా..

నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతుంది.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ,డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్నినిర్మిస్తుంది.