ఆ హీరోల కోసం కథలు రెడీ చేస్తున్న రాజ్ తరుణ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఉయ్యాలా జంపాలా మూవీతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు రాజ్ తరుణ్. ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ సినిమాతో మరో సక్సెస్ సాధించాడు. ఇప్పుడు హ్యాట్రిక్ సాధించడానికి కుమారి 21 ఎఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 20న రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే...రాజ్ తరుణ్ డైరెక్టర్ అవుదామనుకుని ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి...అనుకోకుండా హీరో అయిపోయాడు. అయితే డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో కథలు రెడీ చేస్తున్నాడట. హీరో అల్లు అర్జున్, కమెడియన్ టర్నడ్ హీరో సునీల్...వీరిద్దరి కోసం కథలు రెడీ చేస్తున్నాడట. ఇటీవల సునీల్ కలిసినప్పుడు కథ గురించి చెబితే నువ్వే డైరెక్షన్ చేయ్ అన్నారట. భవిష్యత్ లో డైరెక్షన్ చేస్తానో లేదో తెలియదు కానీ..ప్రస్తుతానికి నటుడిగా ఫుల్ బిజీగా ఉండడం హ్యాపీగా ఉందంటున్నాడు రాజ్ తరుణ్.అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com