రాజ్ తరుణ్ 'లవర్' ఆడియో ఆవిష్కరణ
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం 'ఊయ్యాల జంపాల'తో సక్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులదరికీ చాలా దగ్గరయ్యారు. ఇప్పుడు సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారధ్యం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'లవర్' సినిమాలో నటిస్తున్నారు.
'అలా ఎలా?' వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టకున్న దర్శకుడు అనీశ్ కృష్ణ దర్శకుడు. శిరీశ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. హర్షిత్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఆడియో వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ సీడీని సతీశ్ వేగేశ్న విడుదల చేశారు. తొలి సీడీని అనిల్ రావిపూడి విడుదల చేశారు. దిల్‌రాజు తొలి సీడీని అందుకున్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ "లాస్ట్ ఇయర్ ఆరు సిక్స్ లు, ఫోర్లు కొట్టి తర్వాతి బాల్ కొట్టేటప్పుడు బ్యాట్స్ మేట్ ఎంత నెర్వస్‌గా ఫీలవుతాడో, ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. 'అలా ఎలా'ని ఫ్యామిలీ మెంబర్స్ 12 మంది వెళ్లి చూశాం. హిలేరియస్‌గా ఎంజాయ్ చేశాం. ఒక ఐడియా ఉందని అనీష్ కృష్ణ చెప్పాడు. రాజుగారు పిలిచాడు.. నేను వెళ్లి చేసేశాను అని అనీష్ చాలా ఈజీగా చెప్పాడు. కానీ ఆ తర్వాత అంత ఈజీగా కాలేదు. 'అలా ఎలా'లాగే ఈ సినిమా కూడా ఎంటర్‌టైనింగ్ వేలో చేశాడు.ఫస్ట్ సినిమాలాగా చేస్తే ఒన్లీ మల్టీప్లెక్స్ లలో ఆడితే మాకు డబ్బులు రావు, అని చెప్పా. సరేనని తను బాగా చేశాడు.
ఇదిలా ఉంటే 'నాకు సోలోగా ఒక సినిమా ఇవ్వండి. నేను ప్రూవ్ చేసుకుంటాను' అని హర్షిత్ చెప్పడం మొదలుపెట్టాడు. అందరు ఫ్యామిలీస్‌లో ఉన్న స్ట్రగులే మా దగ్గరా కనిపించింది. ఇన్నేళ్లుగా నేను, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు కలిసి ట్రావెల్ అవుతున్నాం. కంటెంట్‌ని నమ్మి ఇంత దూరం వచ్చాం. ఇంత దూరం పెట్టుకున్న నమ్మకం చిన్న పొరపాట్ల వల్ల మిస్ ఫైర్ అయితే ఇబ్బందిగా ఉంటుంది. ఇందాక అనిల్ అన్నాడు.. 'యావిడ్‌లో నా సినిమాను జడ్జ్ చేశావ్. నేను ఈ సినిమాను జడ్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని అన్నారు. తనే కాదు.. చాలా మంది అలాగే ఎదురుచూస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ వస్తున్నప్పుడు 'వారి పనితీరు ఎలా ఉంది' అని అందరూ ఎదురుచూస్తుంటారు.
ఒకవేళ సక్సెస్ రాకపోతే ఆ ప్రభావం వారి మీద ఎక్కువగా ఉంటుందన్నదే మా భయం. ఈ సినిమా కథ విన్నాక హర్షిత్‌ని వినమని చెప్పాను. నేను బిగినింగ్ డేస్‌లో ఏం చేశామో... అలాగే చేశాడు హర్షిత్. రాజ్ తరుణ్ లుక్ నుంచి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకున్నాడు. మ్యూజిక్ డైరక్టర్స్ ఐదుగురితో పనిచేయించుకుంటానని అన్నాడు. ఈ సినిమాకు నువ్వు అలా ట్రై చేస్తే 'బడ్జెట్ ఎక్కడికి పోతుంది' అని అన్నా. 'నాకు ఫ్రీడమ్ ఇవ్వండి. మీరిచ్చిన బడ్జెట్‌లో తీసి చూపిస్తా' అని అన్నాడు. 'ఫిదా'కు జె.బి. మంచి బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చాడు. ఈ సినిమాకు కూడా అతనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాడు. మాకు గతేడాది నుంచి వస్తున్న సక్సెస్ ఆగకూడదు. తనకి తొలి సినిమా సక్సెస్ కావాలి. వచ్చేనెల విడుదల చేస్తాం. పాటలు చాలా బావున్నాయి.
ఫస్ట్ లుక్ ట్రెండింగ్ అయిందని అందరూ మెసేజ్ పెడుతుంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే రాజ్ తరుణ్ కంటిన్యూస్ ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినా ట్రెండింగ్ అయిందంటే మా బ్యానర్‌కి ఉన్న వేల్యూ అని అర్థమైంది. ఫస్ట్ లుక్ మెప్పించినట్టే ట్రైలర్, పాటలు, సినిమా తప్పకుండా హిట్ అవుతాయి. రాజ్‌తరుణ్ తో ఇంతకు ముందే సినిమా చేయాల్సింది. కానీ మిస్ ఫైర్ అయింది. ఇప్పటి నుంచి రాజ్ తరుణ్‌కి సరిపోయే కథలు ఉన్న ప్రతిసారీ సినిమాలు చేస్తాం" అని అన్నారు.
హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ "మామూలుగా అబ్బాయి సినిమాల్లోకి వస్తానంటే తల్లిదండ్రులు ఇన్వెస్ట్ చేస్తారు. కానీ నా విషయంలో బాబాయ్‌లు ఖర్చు పెట్టారు. వాళ్లు నన్ను నమ్మి రూ.10కోట్ల దాకా ఖర్చుపెట్టారు. అందుకు వారికి ధన్యవాదాలు. పెద్ద డీఓపీలు ఉంటే సినిమా హిట్ అవుతుందని మా బాబాయ్‌లు `కొత్త బంగారు లోకం`లో నమ్మారు. మా సంగీత దర్శకులు రుషి రిచ్ యుకె నుంచి వచ్చి నేటివ్ సాంగ్ చేశారు. సాయి కార్తీక్ మెలోడీ ఇవ్వగలడని అనిల్ రావిపూడి సినిమా ద్వారా తెలుసుకున్నాం.
శ్రీమణి రాత్రుళ్లో పాటలు రాసి మా బాబాయ్‌కి ఫోన్ చేసేవారు. ఫలానా వారి అబ్బాయి అని నన్ను గుర్తించింది వేగేశ్న సతీష్‌గారే. అనిల్ గారు కూడా నన్ను ఎప్పుడూ ప్రోత్సహించేవారు. మా దర్శకుడు, మా హీరో, హీరోయిన్లు అందరూ చాలా కష్టపడ్డారు. వీళ్లందరికీ మించి ఏ లొకేషనూ మేం ఎక్కడికీ తిరగలేదు. సమీర్‌గారిని మా బాబాయ్ ఒప్పించారు. సమీర్ అన్నతో మాట్లాడి చెప్పి సెట్ చేశారు. రాజాగారు చాలా మంచి స్టిల్ ఫొటోగ్రాపర్. ఈ సినిమా లొకేషన్స్ అన్నీ సమీర్‌గారు చూసినవే. టోటల్ టీమ్ అంతా కష్టపడి చేశారు. ప్రేక్షకులకు నచ్చే టాలెంట్‌ని ప్రోత్సహించండి" అని అన్నారు.
దర్శకుడు అనీశ్ కృష్ణ మాట్లాడుతూ "ఇది నా రెండో సినిమా. నా తొలి సినిమా `అలా ఎలా` మంచి హిట్ అయింది. దిల్‌రాజు సంస్థలో ఈ రెండో సినిమాను చేయడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమాకు రాజుగారు బ్యాక్‌డోర్ సపోర్ట్ ఇచ్చారు. అది 50 రోజులు ఆడింది. ఈ సినిమాకు మెయిన్ ఎంట్రీ సపోర్ట్ ఇచ్చారు. దీని గురించి పెద్దగా మాట్లాడలేకపోతున్నాను. పోస్ట్ రిలీజ్ మాట్లాడతాను. `అలా ఎలా` సినిమా చూసి `మంచి స్క్రిప్ట్ పట్టకరా.. సినిమా చేద్దాం` అని రాజుగారు అన్నారు. మూడున్నరేళ్ల తర్వాత ఒకసారి మెసేజ్ పెట్టి రాజుగారిని వెళ్లి కలిశాను. 20 నిమిషాలు కథ విని బావుందన్నారు.
బౌండెడ్ స్క్రిప్ట్ ఇస్తే మరుసటి రోజు ఉదయం 5 గంటలకు మెసేజ్ పెట్టారు.. 8 గంటలకు ఆఫీస్‌కి రమ్మని. నమ్మలేకపోయాను. `ఆర్య తర్వాత అంత ఫ్రెష్‌నెస్ కనిపించింది ఈ స్క్రిప్ట్ లో. చిన్న చిన్న మార్పులున్నాయి. ఆడిటోరియంలో 60 శాతానికి నచ్చితే చాలనుకుని నువ్వు చేశావు. దాన్ని నేను 100 శాతం అందరికీ రీచ్ అయ్యేలా చేస్తాను` అని అన్నారు. ఆ ప్రకారమే చేశాం" అని అన్నారు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ "ఇందకా రాజా రవీంద్రగారు ఫస్ట్ సినిమాలాగా అనుకుంటాం అని అన్నారు. నాకు అలాగే ఉంది. తొలి సినిమాలాగానే అనుకుంటున్నా. సమీర్‌గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా రావడానికి కారణం ఆయనే. నా లుక్ మారడానికి, కొత్తగా ఉండటానికి కారణం హర్షిత్. నా గురించి నా కన్నా ఎక్కువ కేర్ తీసుకుంది హర్షిత్. నన్ను భరించినందుకు, ఈ సినిమాను ఇంత బాగా తీసినందుకు అనీష్‌కి ధన్యవాదాలు. సంగీత దర్శకులు అందరూ మంచి మ్యూజిక్ ఇచ్చారు.
రిద్ధిని చూసి ఎన్నోసార్లు ఇన్‌స్పయిర్ అయ్యాను. చాలా హార్డ్ వర్క్ చేసే అమ్మాయి. ఆర్టిస్టులకు, టీమ్‌కి అందరికీ ధన్యవాదాలు. దిల్‌రాజుగారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. దిల్‌రాజు నాతో ఏడాదికి ఒక సినిమా చేస్తానని మాట ఇస్తే.. నేను ఇంకే సినిమాలనూ ఒప్పుకోను. దయచేసి ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు" అని అన్నారు.
సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ "ఒక సినిమా సక్సెస్‌లో సాంగ్స్ మేజర్ పార్ట్. అందులోనూ లవ్ స్టోరీ అంటే తప్పకుండా పాటలే ప్రధానం. అందుకే అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్. హర్షిత్ డిఫరెంట్ మ్యూజిక్ డైరక్టర్స్ తో చేస్తున్నానని చెప్పారు. హర్షిత్ కి చాలా ఓపిక ఎక్కువ. అందుకే ఇంత మందితో పనిచేయించుకోగలిగారు. హర్షిత్ చాలా ఎఫర్ట్ పెట్టారని అందరూ చెప్పారు.
ముందున్న వారికంటే వారసులు తక్కువగా కష్టపడతారని అనుకుంటాం. కానీ దిల్‌రాజుగారి వారసుడు ఆయనకన్నా ఎక్కువగా కృషి చేస్తున్నాడు హర్షిత్. గత ఏడాది దిల్‌రాజు బ్యానర్‌లో తొలి సినిమా `శతమానం భవతి`. ఈ ఏడాది తొలి చిత్రం `లవర్`. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ కావాలి" అని అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ "లాస్ట్ ఇయర్ వరుసగా ఆరు సిక్స్ లు కొట్టి రాజుగారు అలసిపోయారు. ఆరు నెలల గ్యాప్ తర్వాత రాజుగారు `లవర్`తో వస్తున్నారు. హర్షిత్‌కి సినిమా గురించి చాలా నాలెడ్జ్ ఉంది. చాలా తపన పడతాడు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు రాజుగారికి తగ్గ వారసుడు హర్షిత్.
నేను తీసిన ప్రతి సినిమాకీ ఎడిట్ టేబుల్ మీద రాజుగారు, శిరీష్‌గారు చూడ్డానికి ముందు వార్మప్ మ్యాచ్‌లాగా హర్షిత్ చూస్తాడు. కరెక్ట్ జడ్జిమెంట్ చెబుతాడు. ఈ సారి నేను వర్మప్‌గా రెడీగా ఉన్నా. తన దగ్గర మంచి స్క్రిప్ట్ కూడా ఉంది. నేనిప్పుడే రివీల్ చేయను. హర్షిత్ లాంగ్ వే ఉంది. `అలా ఎలా` చూసి ఎవరో చాలా బాగా కామెడీని డీల్ చేశాడని అనుకున్నా. రాజుగారి కాంపౌండ్‌లో చూశాను. తప్పకుండా హిట్ కొడతాడు" అని అన్నారు.
సంగీత దర్శకుడు రిషి రిచ్ మాట్లాడుతూ "ఈ సినిమాకు పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రొడక్షన్ హౌస్, ఇక్కడి నటీనటులు అందరూ చాలా బాగా రిజీవ్ చేసుకున్నారు. ఈ ఇండస్ట్రీలో ఇంకా చాలా వర్క్ చేయాలని అనుకుంటున్నాను. గ్రేట్ ఎక్స్ పీరియన్స్ టు వర్క్ ఫర్ దిస్ మూవీ" అని అన్నారు.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ "మా పరిశ్రమలో నాకూ ఒక పాట ఇచ్చిన అనీష్‌కి చాలా థాంక్స్. చాలా మంచి పాట చేశాను. వయొలిన్ బిట్ విని దిల్‌రాజుగారు ఈ పాటను ఓకే చేశారు" అని చెప్పారు.
శ్రీమణి మాట్లాడుతూ "ఈ సినిమాలో నేను ఐదు పాటలు రాశాను. ఒకటి సీతారామశాస్త్రిగారు రాశారు. హర్షిత్‌గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. లవర్ సినిమాలో మేం మొదలుపెట్టిన పాట రాముడి బాణంలా పాట. అనంతపురం వెళ్లి లొకేషన్‌లో రాశాను. వరుసగా రాస్తూ వచ్చాను.
ప్రతి పాటకీ కొత్త కాన్సెప్ట్ ఉండాలని డిసైడ్ చేసుకుని వర్క్ చేశాం. సిట్చువేషన్స్ పరంగా డిస్కస్ చేసుకుని రాశాం. మంచి పాటలు రాశాం. నాకు మంచి పేరు తీసుకొస్తాం. ముంబైకి వెళ్లి సోనూ నిగమ్‌గారితో, రుషి రిచ్‌గారితో పనిచేయడం చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది" అని చెప్పారు.
కెమెరామేన్ సమీర్ రెడ్డి మాట్లాడుతూ "చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. అనీష్‌కి, హరీష్‌కి, రాజ్‌కీ, రిద్ధి కుమార్‌కి థాంక్స్" అని చెప్పారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ "లవర్ ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. అందరి ముందుకు త్వరలో తెరమీదకు వస్తాడు. అందమైన సంగీతం, అంతే అందమైన దృశ్యాలు ఉన్న సినిమా `లవర్`. అనీష్‌గారు మంచి పాత్ర ఇచ్చారు. నేను ఇప్పటిదాకా కనపడని లుక్‌లో ఈ సినిమాలో కనిపిస్తాను. మంచి సినిమాలో ఓ పాత్ర అయినందుకు చాలా ఆనందంగా ఉంది" అని చెప్పారు.
రిద్ధి కుమార్ మాట్లాడుతూ "నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమాలో భాగమైనందుకు. దిల్‌రాజుకు, హర్షిత్‌కి,అనీష్‌కి, సమీర్‌కి అందరికీ ధన్యవాదాలు. తెరమీద నేను అందంగా కనిపించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాజ్ మంచి హీరో. చాలా సపోర్టివ్ గా ఉన్నారు. మా నాన్న ఆర్మీ ఆఫీసర్. ఇండో - చైనా బార్డర్‌లో ఉన్నారు. నా ప్రోగ్రామ్‌ని తైవాంగ్‌లో లైవ్‌లో చూస్తున్నారు" అని చెప్పారు.
రాజా రవీంద్ర మాట్లాడుతూ "భద్రకు పనిచేసినా, శతమానం భవతికి పనిచేసేటప్పుడు దిల్‌రాజుగారితో ఎక్కువగా కలిశాను. ఈ సినిమా చేసేటప్పుడు మరింత అనుబంధం పెరిగింది. ఆయన అన్ని క్రాఫ్ట్ ల కోసం అంత కష్టపడతారు. హర్షిత్ నిద్ర లేకుండా పనిచేశారు. రాజ్ తరుణ్‌కి ఇది తొలి సినిమా అయితే బావుండనుకున్నాం. ఈ సినిమానే తనకి తొలి సినిమాగా భావించి మేం ముందుకు వెళ్దాం అని అనుకుంటున్నాం" అని చెప్పారు.
ప్రవీణ్ మాట్లాడుతూ "పాటలు బావున్నాయి. విజువల్‌గా అద్భుతంగా ఉంది. 'అద్భుతం' అనే పాట నిజంగా అద్భుతంగా ఉంది. దిల్‌రాజుగారి సంస్థలో సినిమా అంటే మాకు ప్రత్యేకంగా ఉంటుంది. దిల్‌రాజుగారు సక్సెస్‌లకి కేరాఫ్ అడ్రస్. ఆయన ఆలోచనలకు వారసుడు హర్షిత్. ఆయన సక్సెస్‌లకు కూడా వారసుడు కావాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
సురేందర్ రెడ్డి మాట్లాడుతూ "ఈ సినిమా కోసం హర్షిత్ చాలా కష్టపడ్డారు. అనీష్ కూడా అంతే కష్టపడ్డారు. రాజుగారు, శిరీష్‌గారు అలాగే కష్టపడ్డారు. టీమ్ అందరికీ చాలా థాంక్స్. సినిమా పెద్ద హిట్ కావాలి" అని కోరారు.
రాజా మాట్లాడుతూ "రాజుగారి బ్యానర్‌లో ఇది నా మూడో సినిమా. 'ఎవడు', 'ఫిదా', తర్వాత ఇది మూడో సినిమా. నటుడిగా నాకు గుర్తింపు వచ్చింది ఈ బ్యానర్ ద్వారానే .ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. ఈ సినిమా ద్వారా నాకూ మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను" అని చెప్పారు.
తుల్యా జ్యోతి మాట్లాడుతూ "నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు" అని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments