రవిబాబు దర్శకత్వంలో రాజ్ తరుణ్

  • IndiaGlitz, [Tuesday,February 20 2018]

తక్కువ బడ్జెట్‌తో ఓ సినిమా నిర్మించాలంటే.. కథానాయకుల జాబితాలో రాజ్ తరుణ్ పేరు ఎలా ఉంటుందో.. దర్శకుల జాబితాలో రవిబాబు పేరు కూడా అలా ఉంటుంది. గతంలో తక్కువ బడ్జెట్ సినిమాలతో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు ఈ ఇద్ద‌రు. అలాంటి వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతోందనే కథనాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ సినిమాని స్వప్నదత్ నిర్మిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం రాజ్ త‌రుణ్‌, ర‌విబాబు చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తైన తర్వాతే.. వీరి కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇదిలా వుంటే.. ప్రస్తుతం రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజుగాడు' సినిమా తెరకెక్కుతోంది. అలాగే.. డైరెక్టర్ రవిబాబు కూడా అదుగో' సినిమాని రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకుని నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. రవిబాబు సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా రాజ్ తరుణ్ లైన్లో పెట్టారని సమాచారం.

More News

వరుణ్ తేజ్ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఫిదా','తొలిప్రేమ'సినిమాలతో వరుస విజయాలు అందుకుని అభిమానులను,ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

నాగ్, ఆర్జీవీ చిత్రానికి ఆ ఇద్దరిలో ఎవరో?

కింగ్ నాగార్జున,సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో

మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌తో క‌ళ్యాణ్ రామ్‌?

నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. గత ఏడాది తన సోదరుడు ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' చిత్రాన్ని నిర్మించి.. విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఈ యంగ్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం 'ఎం.ఎల్.ఎ', 'నా నువ్వే' సినిమాలలో క‌థానాయ‌కుడిగా నటిస్తున్నారు క‌ళ్యాణ్‌.

డబ్బింగ్‌లో కొత్తదనం కోసం మహేష్ కసరత్తు

ప్రేక్షకులకు, అభిమానులకు తన సినిమాలో కొత్తదనం చూపించాలనుకుని తపన పడే నటులలో మహేష్ బాబు ఒకరు. అలాగే.. ఏదో ఒక సామాజిక అంశంతో సినిమాను తెరకెక్కించ‌డం దర్శకుడు కొరటాల శివ శైలి.  అలాంటి వీరిద్దరి కలయికలో వస్తున్న 'భరత్ అనే నేను' సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.

వివాద‌స్ప‌ద అంశాల‌తో 'నవాబ్'

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు మణిరత్నం రూపొందిస్తున్న‌ మల్టీస్టారర్ మూవీ 'నవాబ్'.  కుటుంబనేపథ్యంతో సాగే ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, ప్రకాష్ రాజ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌, అదితిరావు హైదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.