క్రిస్మ‌స్ బ‌రిలో రాజ్‌త‌రుణ్

  • IndiaGlitz, [Tuesday,October 29 2019]

ఉయ్యాల‌జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్ చిత్రాల‌తో వ‌రుస స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్‌కి త‌ర్వాత ఎందుక‌నో ఆశించిన స్థాయిలో స‌క్సెస్‌లు మాత్రం ద‌క్క‌లేదు. ఆయ‌న చేసిన ప్రయ‌త్రాల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి. ఇప్పుడు రాజ్‌త‌రుణ్ త‌న ఆశ‌ల‌న్నింటినీ 'ఇద్ద‌రిదీ ఒక‌టే లోకం' సినిమాపై పెట్టుకున్నాడు. రాజ్‌త‌రుణ్‌, షాలిని పాండే జంట‌గా న‌టించారు. ఈ సినిమాకు నిర్మాత దిల్‌రాజు. నిజానికి ఈ సినిమాను న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నారు. కానీ మార్కెట్ బాగా లేక‌పోవ‌డంతో దిల్‌రాజు డ్రాప్ అయ్యాడు. ఇక ఆల‌స్యం చేస్తే బావుండ‌ద‌ని భావించిన దిల్‌రాజు 'ఇద్ద‌రిదీ ఒక‌టే లోకం' చిత్రాన్ని డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే కిస్మ‌స్ రేసులో డిసెంబ‌ర్ 20న నంద‌మూరి బాల‌కృష్ణ 'రూల‌ర్‌' సినిమాతో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా 'ప్ర‌తిరోజూ పండ‌గే' సినిమా ఉంది. ఈ రెండు సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి దిల్‌రాజు 'ఇద్ద‌రిదీ ఒక‌టే లోకం' సినిమాను డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. డిసెంబ‌ర్ 25న హాలీడే, జ‌న‌వ‌రి 1 కూడా క‌లిసొచ్చే రోజుగా దిల్‌రాజు భావిస్తున్నాడు. ఏ మాత్రం హిట్ టాక్ వ‌చ్చినా యూత్ ఈ సినిమాను చాలా పెద్ద హిట్ చేస్తార‌న‌డంలో సందేహం లేదు. మ‌రి దిల్‌రాజు ఈ సినిమా విడుద‌ల తేదీని అధికార‌కంగా ఎప్పుడు ప్ర‌క‌టిస్తాడో వేచి చూడాలి.

More News

నవంబర్ 13న లవర్‌తో నటి అర్చన పెళ్లి

2004లో ‘నేను’ సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది.

బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అటకెక్కిన ‘ఐకాన్’!

టాలీవుడ్ యంగ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హేగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో..’ ఈ చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.

తిల‌కం పెట్టుకున్న షారూక్.. ట్రోల్ చేశారు

బాలీవుడ్ బాద్‌షా.. ఖాన్ త్రయాల్లో ఒక‌రైన షారూక్‌ఖాన్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. దీపావ‌ళి సంద‌ర్భంగా షారూక్ త‌న అభిమానుల‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తుంటాడు.

'టీడీపీని చంద్రబాబు గొంతు పిసికి చంపేస్తున్నారు'

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు.. సొంత పార్టీని గొంతు పిసికి చంపేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన వైసీపీ సభలో ఆయన ప్రసంగిస్తూ..

సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నాడు సమ్మె, కార్మికుల డిమాండ్లపై వాదానలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.