రాజ్ తరుణ్ హీరోయిన్ మారింది

  • IndiaGlitz, [Sunday,December 24 2017]

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్ చిత్రాల‌తో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌. ఆ త‌రువాత కొన్ని ప‌రాజ‌యాలు అందుకున్నా.. ఆడో ర‌కం ఈడో ర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు రాజ్‌. ప్ర‌స్తుతం రంగుల‌రాట్నం, రాజు గాడు చిత్రాల‌తో బిజీగా ఉన్న రాజ్ త‌రుణ్‌.. ఇటీవ‌లే దిల్ రాజు నిర్మించే చిత్రం ప‌ట్టాలెక్కించాడు. అలా ఎలా ఫేమ్ అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నెల రోజుల క్రితం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. కాగా, ఈ చిత్రంలో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ గాయ‌త్రి సురేష్ కథానాయిక‌గా న‌టించాల్సింది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇప్పుడామె స్థానంలోకి మ‌రో హీరోయిన్ వ‌చ్చి చేరింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. పూణేకి చెందిన మోడ‌ల్ రిద్ది కుమార్ ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్‌కి జోడీగా క‌నిపించ‌నుంది. దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం త్వ‌ర‌లోనే వెలువ‌డుతుంది.

More News

రవితేజ సినిమాకి ఆసక్తికరమైన టైటిల్

దాదాపు రెండేళ్ల గ్యాప్ తో మాస్ మహారాజ్ రవితేజ నుంచి వచ్చిన చిత్రం 'రాజా ది గ్రేట్'.

'పరిచయం' ప్రీ లుక్ విడుదల

ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై "హైద్రాబాద్ నవాబ్స్" ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో

జయహో రామానుజా లోగో ఆవిష్కరణ

స్వర్ణ భారతి క్రియేషన్స్ అద్వర్యం లో సాయి వెంకట్ స్వీయ దర్శకత్వం లో జయహో రామానుజా సినిమా యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది .

వెంకీకి జోడీగా నదియా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'అజ్ఞాతవాసి'.

పోస్ట్ ప్రొడక్షన్లో నిత్య సినిమా

పేరుకి కేరళకుట్టి అయినా..తెలుగువారికి అనతికాలంలోనే దగ్గరైంది నిత్యా మీనన్.అలా మొదలైందితో తెలుగు తెరకు పరిచయమైన ఈ బొద్దుగుమ్మ.