బన్ని, ఉదయ్ బాటలో రాజ్ తరుణ్?
Send us your feedback to audioarticles@vaarta.com
చిన్నవయసులోనే కథానాయకుడుగా తనకంటూ ఓ క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు రాజ్ తరుణ్. 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్తా మావ' చిత్రాలతో రెండు వరుస విజయాలను సొంతం చేసుకున్న తరుణ్.. అతి త్వరలో రానున్న 'కుమారి 21 ఎఫ్'తో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధిస్తే గనుక.. చిన్న వయసులోనే హ్యాట్రిక్ హిట్స్‌ని సొంతం చేసుకున్న హీరోలలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంటాడు తరుణ్.
ఇదివరకు ఈ జాబితాలో ఉదయ్ కిరణ్, అల్లు అర్జున్ ఉన్నారు. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే'లతో ఉదయ్ హ్యాట్రిక్ హిట్స్‌ని సొంతం చేసుకుంటే.. 'గంగోత్రి', 'ఆర్య', 'బన్ని' చిత్రాలతో బన్ని ఈ తరహా ఫీట్‌ని రిపీట్ చేశాడు. మరి రాజ్ తరుణ్ కూడా వారి అడుగు జాడల్లోనే వెళతాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com