పవన్ కళ్యాణ్, రవితేజ బాటలో రాజ్ తరుణ్?
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఉయ్యాలా జంపాలా’, ‘కుమారి 21ఎఫ్’, ‘సినిమా చూపిస్త మావ’ వంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్. కాని గత కొద్ది కాలంగా రాజ్ తరుణ్ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘రంగులరాట్నం’ గాని, శుక్రవారం విడుదలైన ‘రాజుగాడు’ గాని ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కాగా.. దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న ‘లవర్’ ఆగష్టులో విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. 2015లో తమిళంలో ఘన విజయం సాధించిన ‘నానుమ్ రౌడీ దాన్’ (తెలుగులో ‘నేనూ రౌడీనే’గా డబ్బింగ్ అయ్యింది) సినిమా తెలుగు హక్కులని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ కైవసం చేసుకున్నారు. ఈ సినిమా రీమేక్‌లో రాజ్ తరుణ్ నటించనున్నారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇదిలా ఉంటే.. విజయం కోసం తెలుగు అగ్ర హీరోలు ఇలా అనువాదం అయిన రీమేక్ సినిమాల్లో నటించడం ఒక ట్రెండ్‌లా మారింది.
ఆ మధ్య.. తమిళ హీరో అజిత్ నటించిన ‘వీరమ్’ (తెలుగులో ‘వీరుడొక్కడే’)ని రీమేక్ చేసి మరీ ‘కాటమరాయుడు’గా సందడి చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే.. ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’) రీమేక్‌లో రవితేజ హీరోగా నటిస్తుండగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు పవన్, రవితేజ బాటలోనే వెళ్ళేందుకు రాజ్ తరుణ్ సిద్ధమవుతున్నాడన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com