కన్నడలోకి రాజ్‌తరుణ్ ఎంట్రీ
Send us your feedback to audioarticles@vaarta.com
మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు కన్నడలోనూ రాజ్‌తరుణ్ నటించబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాది తెలుగులో ఘన విజయం సాధించిన `బ్రోచెవారెవరురా` సినిమాను కన్నడలో రమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాలో రెండు కీలక పాత్రలుంటాయి. ఒకటి హీరో శ్రీవిష్ణు పాత్ర కాగా.. మరొకటి సత్యదేవ్ పాత్ర. ఈ రెండింటిలో ఓ పాత్రలో రాజ్‌తరుణ్ నటించబోతున్నాడట. మరో పాత్రలో శైలేంద్ర బాబు తనయుడు సుమంత్ శైలేంద్ర హీరోగా నటిస్తున్నాడట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రస్తుతం రాజ్‌తరుణ్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఇద్దరి లోకం ఒకటే సినిమాను దిల్‌రాజు బ్యానర్‌లో చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. డిసెంబర్ 25న సినిమా విడుదలవుతుంది. అలాగే విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో `ఒరేయ్ బుజ్జిగా..` సినిమాలోనూ రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
ఒక్క తెలుగులో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నా కూడా రాజ్‌తరుణ్ ఏమాత్రం వెరవక కన్నడలో ఎంట్రీ ఇవ్వాలనుకోవడం ఓ రకంగా ధైర్యం చేస్తున్నట్లే. ఏదైతేనేం తనకు కన్నడలో కూడా హీరోగా మంచి పేరు రావాలని కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com