ఆ సినిమా కంటే ఎక్కువ ఎంటర్ టైన్మెంట్ మా సినిమాలో ఉంటుంది - హీరో రాజ్ తరుణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్...ఈ మూడు చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి అటు ఆడియోన్స్, ఇటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్. తాజాగా రాజ్ తరుణ్ - విష్ణుతో కలసి నటించిన చిత్రం ఈడోరకం ఆడోరకం. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 14న ఈడోరకం ఆడోరకం చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ తో ఇంటర్ వ్యూ మీకోసం..
ఈ మూవీలో అవకాశం ఎలా వచ్చింది..?
రాజా రవీంద్ర ఫోన్ చేసి పంజాబి సినిమా ఉంది చూడు అని డివిడి ఇచ్చారు. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే చూసాను. ఆతర్వాత నెక్ట్స్ డే ఫోన్ చేసి నాకు నచ్చింది చేస్తాను అని చెప్పాను. ఆ విధంగా ఈ సినిమాలో అవకాశం వచ్చింది.
మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నా క్యారెక్టర్ పేరు అశ్విన్. అబద్దాలు చెబుతూ ఎదుటివాళ్లని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్. నేను చెప్పే అబద్ధాల వలన ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.
విష్ణు తో వర్క్ చేస్తున్నావ్ జాగ్రత్తగా ఉండు అని ఎవరైనా చెప్పారా..?
కొంత మంది విష్ణుతో జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. కానీ...విష్ణుని ఈ సినిమా గురించి మాట్లాడడానికి కలిసిన తర్వాత నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. విష్ణుతో వర్క్ చేసిన తర్వాత చాలా హ్యాఫీగా ఫీలయ్యాను.
ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే...నా క్యారెక్టరే ఎక్కువుగా ఉండాలని అనుకుంటారు కదా..! మీ మధ్య అలాంటి సందర్భం వచ్చిందా..?
విష్ణు, నాకు మధ్య అలాంటి చర్చే జరగలేదు. కాకపోతే... విష్ణు డైరెక్టర్ నాగేశ్వరెడ్డి గారితో నా కన్నా...రాజ్ తరుణ్ క్యారెక్టరే ఎక్కువ ఉండాలి అని చెప్పేవారు.
మీ సరసన హేబ్బా పటేల్ ని ఎంపిక చేసారు కదా. ఎవరి నిర్ణయం..?
నేను, హేబ్బా కలసి నటించిన కుమారి 21 ఎఫ్ సినిమా సక్సెస్ అయ్యింది. మా ఇద్దరి ఫెయిర్ బాగుంటుందని ప్రొడ్యూసర్ గారే హేబ్బా పటేల్ ని సెలెక్ట్ చేసారు.
సీనియర్ ఏక్టర్ రాజేంద్రప్రసాద్ ఇందులో ముఖ్యపాత్ర పోషించారు కదా..? ఆయనతో మీ ఎక్స్ పీరియన్స్..?
రాజేంద్రప్రసాద్ గారు ఈ చిత్రంలో విష్ణు తండ్రి పాత్ర పోషించారు. చిన్నప్పటి నుంచి రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు చూసాను.ఇప్పుడు రాజేంద్రప్రసాద్ గారితో నటించాలంటే ఎలా అని ముందు భయపడ్డాను. అయితే... సెట్ లో ఆయన ఎనర్జి ...అందరితో కలిసి పోవడం చూసి భయం పోయింది. నాకు తెలియకుండానే నాపై ఆయన ప్రభావం ఉంది. సీనియర్ ఏక్టర్ రాజేంద్రప్రసాద్ గారితో వర్క్ చేయడం అనేది మరచిపోలేని అనుభూతి.
పంజాబి సినిమాకి ఈ సినిమాకి మార్పులు ఏమైనా చేసారా..?
మన నేటివిటికీ తగ్గట్టు మార్పులు చేసారు. ఆ సినిమా కంటే ఎక్కువ ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
వరుసగా మూడు చిత్రాలతో హ్యాట్రిక్ సాధించారు కదా..దీనికి కారణం అదృష్ణమా..? హార్డ్ వర్కా..?
హార్డ్ వర్క్ అనేది ప్రతి సినిమాకి ఉంటుంది. నా వరకు అయితే ఉయ్యాలా జంపాలా సినిమాలో అవకాశం రావడం అదృష్టం. మిగిలిన రెండు సినిమాల సక్సెస్ కి కారణం హార్డ్ వర్క్ అనుకుంటున్నాను.
వరుసగా మూడు సినిమాలు హిట్ తర్వాత ఫస్ట్ టైమ్ సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాతో ఫెయిల్యూర్ వచ్చింది. ఫెయిల్యూర్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?
నా ఫస్ట్ మూడు సినిమాలు ఎంత ఇష్టపడి చేసానో..ఈ సినిమా కూడా అంతే ఇష్టంతో చేసాను. సినిమా సక్సెస్ అవుతుంది అనుకున్నాను. కానీ.ఎందుకనో ఆడలేదు. అయితే...ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఒకర్ని తప్పు పట్టలేం. అలా జరిగిపోయింది అంతే. సినిమా ఫ్లాప్ అని తెలిసిన తర్వాత గంట బాధపడ్డాను. ఇక నుంచి కథ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
తదుపరి చిత్రాల గురించి..?
డైరెక్టర్ మారుతి నిర్మించే చిత్రంలో నటిస్తున్నాను. అలాగే దిల్ రాజు గారి బ్యానర్ లో శతమానం భవతి అనే సినిమా చేస్తున్నాను. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించే చిత్రం, సీనియర్ డైరెక్టర్ వంశీ గారి డైరెక్షన్ లో రూపొందే సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments