తక్కువ గ్యాప్‌లోనే వస్తున్న రాజ్ తరుణ్
Send us your feedback to audioarticles@vaarta.com
'ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్' చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్. ఆ తరువాత ఆ స్థాయి విజయాలను అందుకోకపోయినా.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది సంక్రాంతికి 'రంగులరాట్నం' చిత్రంతో పలకరించిన ఈ యంగ్ హీరో.. 5 వారాల గ్యాప్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
కాస్త వివరాల్లోకెళితే.. నూతన దర్శకురాలు సంజన రెడ్డి దర్శకత్వంలో తరుణ్ నటించిన 'రాజు గాడు' ఈ చిత్రం మే 11న విడుదల కానుండగా.. అలా ఎలా ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న 'లవర్' చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా కేవలం ఐదు వారాల గ్యాప్‌లో రెండు చిత్రాలతో ఈ యువ కథానాయకుడు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. 'రాజుగాడు' చిత్రంలో క్లెప్టోమేనియా ఉన్న కుర్రాడిగా తనకు తెలియకుండానే దొంగతనాలు చేసే యువకుడిగా రాజ్ తరుణ్ నటించగా.. 'లవర్' చిత్రంలో లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు ఈ యంగ్ హీరో. ఈ రెండు చిత్రాలతోనైనా తిరిగి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments