ముచ్చటగా మూడోసారి ..!
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని హిట్ పెయిర్(హీరో హీరోయిన్)ను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపుతుంటారు. అలాంటి హిట్ పెయిర్స్‌లో నేటి తరంలో రాజ్‌తరుణ్, అవికాగోర్ జోడీ ఒకటి. వీరిద్దరూ గతంలో ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరో హీరోయిన్గా పరిచయం అయ్యారు. సినిమా భారీ విజయాన్ని సాధించింది. తర్వాత సినిమా చూపిస్తమావ చిత్రంలోనూ జోడీ కట్టారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. అయితే తర్వాత ఈ జోడీ మరో సినిమాలో కలిసి నటించలేదు. మధ్య అవికాగోర్ సినిమా రంగానికి దూరమైంది. గత ఏడాది ఈ అమ్మడు రాజుగారిగది 3 చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.
చాలా గ్యాప్ తర్వాత ఈ జోడీ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. వివరాల్లోకెళ్తే.. గతంలో రాజ్‌తరుణ్‌తో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి మరో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్గా అవికాగోర్‌ను సంప్రదించారట. ఆమెకు కూడా కథ నచ్చడంతో నటించడానికి ఓకే చెప్పారట. ప్రస్తుతం కరోనా ప్రభాం కొనసాగుతుంది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుందని వార్తలు వినపడుతుతన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments