'అంధగాడు' ప్రీ రిలీజ్ వేడుక

  • IndiaGlitz, [Sunday,May 28 2017]

ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'అంధ‌గాడు'. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు.స‌క్సెస్‌ఫుల్ రైట‌ర్ వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో. న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. .
ఈ కార్య‌క్ర‌మంలో..
వెలిగొండ శ్రీనివాస్ నాకు ఎప్ప‌టి నుంచో తెలుసు. ఆయ‌న చెప్పిన క‌థ‌ను రాజ్ త‌రుణ్‌కి వినిపించాం. రాజ్ త‌రుణ్‌కు కూడా న‌చ్చ‌డంతో సినిమా చేశాం. ఇందులో పూర్తి స్థాయి విల‌న్ పాత్ర‌లో న‌టించాను. నా కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సినిమా జూన్ 2న విడుద‌ల కానుంది. జూన్ 1 రాత్రి ఏపీ, తెలంగాణ‌లో ప్రీమియ‌ర్ షోల‌ను నిర్వ‌హిస్తామ‌ని రాజా ర‌వీంద్ర తెలిపారు.
పాట‌లు చేయ‌డానికి నాకు మంచి సిట్చువేష‌న్స్ దొరికాయి అంద‌రికీ న‌చ్చే పాట‌లు ఇందులో ఉన్నాయి. రామ‌జోగయ్య‌శాస్త్రిగారు, భాస్క‌ర‌భ‌ట్ల‌గారు మంచి పాట‌లు రాశారు. వెలిగొండ శ్రీనివాస్ చాలా టాలెంటెడ్ డైర‌క్ట‌ర్‌. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. భ‌విష్య‌త్తులోనూ ఆయ‌న‌తో మ‌ర‌లా ప‌నిచేయాల‌ని అనుకుంటున్నానని మ్యూజిక్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ చంద్ర చెప్పారు.
నేను ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన‌ప్పుడు నా పేరు ప‌త్రిక‌లో చూసి ఎంత ఆనందం పొందానో, ఇప్పుడు అంత ఆనందంగా ఉంది. నేను రైట‌ర్ కావ‌డానికి శివ‌నాగేశ్వ‌ర‌రావు, మ‌హేంద్ర‌గారు, శ్రీహ‌రిగారు కార‌ణం. సాధార‌ణంగా ఏ రైట‌ర్‌క‌యినా డైర‌క్ట‌ర్ కావాల‌నే కోరిక ఉంటుంది. నా కోరిక రాజ్‌త‌రుణ్ ద్వారా తీరుతోంది. నా మీద బాధ్య‌త‌ను పెట్టి ఎంక‌రేజ్ చేశారు. అదే బాధ్య‌త‌ను నేను నిర్వ‌ర్తించాను.రాజా ర‌వీంద్ర‌గారు ఈ సినిమాకు క‌రెక్ట్ గా యాప్ట్ అయ్యారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు లేక‌పోతే మా సినిమా లేదు. చాలా బాగా ఎంక‌రేజ్ చేశారాయ‌న అనిల్‌సుంక‌ర‌గారికి థాంక్స్ అని వెలిగొండ శ్రీనివాస్ అన్నారు. .
రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు అంద‌రితో క‌నెక్ట్ అయిపోతారు ఆయ‌న‌. స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చి మ‌మ్మ‌ల్ని మంచి రూట్‌లో తీసుకెళ్తారు. రెస్ట్ లెస్ ఫెలోకి ప‌ర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శేఖ‌ర్‌చంద్ర‌. చాలా మంచి సంగీతాన్నిచ్చారు.
హెబ్బాతో మూడో సినిమా. వెలిగొండ శ్రీనివాస్ చాలా అద్భుతంగా చేశారు. క‌చ్చితంగా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసే మూవీ అవుతుంద‌ని రాజ్ త‌రుణ్ అన్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ మేకింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ జయంతిరోజున ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డం ఆనందంగా ఉంది. ఆయ‌న ఇంట్లో పుట్టి, ఆయ‌న చేతుల మీదుగా పెరిగిన వ్య‌క్తిని నేను. త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ రైట‌ర్లుగా మొద‌లై అద్భుత‌మైన ద‌ర్శ‌కులుగా పేరు తెచ్చుకున్నారు. వెలిగొండ కూడా వాళ్ల స‌ర‌స‌న చేరుతాడు. శేఖ‌ర్‌చంద్ర చాలా మంచి సంగీతాన్నిచ్చారు. రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌ని చూస్తే ధ‌ర్మేంద్ర‌, హేమ‌మాలిని, కృష్ణ‌- విజ‌య‌నిర్మ‌ల‌లాగా అనిపిస్తోంది. వారిద్ద‌రు ఇంకో 30 సినిమాలు చేసినా చూడొచ్చు. ఈ సినిమా అంద‌రినీ అల‌రిస్తుందని రాజేంద్ర‌ప్ర‌సాద్ చెప్పారు.
ఈ కార్య‌క్ర‌మంలో రామ‌జోగ‌య్య‌శాస్త్రి, కెమెరామేన్ బి.రాజ‌శేఖ‌ర్ కూడా పాల్గొన్నారు. యూనిట్ స‌భ్యులంద‌రికీ వేదిక మీద షీల్డ్ ల‌ను అంద‌జేశారు.
రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రిక‌పాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌

More News

తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పుస్కూర్ రామ్ మోహన్ రావు

తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పుస్కూర్ రామ్ మోహన్రావును

జార్జ్..బట్టర్ ఫ్లై ఎఫెక్ట్

'నువ్వు నా దగ్గరికి నా మిత్రుడి లా వచ్చి ఉండినట్లు అయి ఉంటె,నీ కూతురిని చెరపట్టిన వాళ్ళను ఈపాటికే నరకం చూస్తూ ఉండే వాళ్ళు'

యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమాగా 'కురుక్షేత్రం'

యాక్షన్ కింగ్ అర్జున్ అరుదైన మైలురాయికి చేరుకున్నాడు.కెరీర్ లో అతికొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యే 150సినిమా చేస్తున్నాడు.

అమెరికాలో యూత్ స్టార్ నితిన్ 'లై' భారీ యాక్షన్ సీన్స్

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్

జూన్16న అవంతిక

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా పూర్ణ ప్రత్యేక పాత్రలో