కలెక్షన్స్ తో అదరగొడుతున్న రాజ్ తరుణ్ 'అంధగాడు'
Saturday, June 3, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ చిత్రాలతో మంచి విజయాలను సాధిస్తున్న యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ హీరోగా ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన హిలేరియస్ ఎంటర్టైనర్ `అంధగాడు`.గతంలో ఈ కాంబోలో ఆడోరకం-ఈడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. అంధగాడుతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. అలాగే హిట్‌పెయిర్ రాజ్‌రతుణ్, హెబ్బా పటేల్‌కు కూడా హ్యాట్రిక్ మూవీగా నిలిచింది `అందగాడు`.
సినిమా ప్రారంభం నుండి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా విడుదలైన ఆట నుండే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌ను సాధిస్తోంది. తొలిరోజు 3.75 కోట్ల రూపాయలను వసూలు చేసిన `అంధగాడు` రాజ్‌తరుణ్ కెరీర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా అంధగాడు చిత్రాన్ని చూసి అందులో రాజ్‌తరుణ్ నటనను, సినిమాలో ట్విస్టులు ఎంతో బావున్నాయని అప్రిసియేట్ చేశారు.
రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. సినిమాలో కామెడి, సెంటిమెంట్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేజర్ హైలెట్‌గా రూపొందిన ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే డెఫనెట్‌గా `అంధగాడు` చిత్రం రాజ్‌తరుణ్ కెరీర్లో బిగ్గెస్ట్హిట్గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments