BiggBoss: బతికిపోయిన ఫైమా, రాజ్ ఎలిమినేషన్... విన్నర్ ఎవరో చెప్పేసిన మిస్టర్ కూల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆదివారం వస్తుంటే చాలు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో టెన్షన్ పీక్స్‌లో వుంటుంది. ఎవరు ఇంటి నుంచి బయటకు వెళతారో.. ఎవరికి హౌస్‌లో కొనసాగే ఛాన్స్ వుంటుందోనని. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్‌బాస్ 6 తెలుగు విమర్శలు మూటగట్టుకుంది. కంటెస్టెంట్స్ ఎంపిక, ఏ మాత్రం కొత్త కంటెంట్ లేకపోవడానికి తోడు, ఎలిమినేషన్ ప్రాసెస్‌పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని బయటికి పంపి, ఏ మాత్రం విషయం లేని వారిని సేవ్ చేయడం ఏంటంటూ నెటిజన్లు, బిగ్‌బాస్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ వారం కూడా అదే అపవాదును మూటగట్టుకున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా, తన పని తాను చేసుకుపోయే వ్యక్తిగా వున్న రాజశేఖర్‌ను ఎలిమినేట్ చేశారు. ఇతని ఆటతీరు చూసి ఖచ్చితంగా టాప్ 5లో వుంటాడనుకుంటే ... అందరికి షాకిస్తూ ఇంటికి పంపేశారు.
ఈ వారం రేవంత్, కీర్తి తప్పించి... మిగిలిన ఏడుగురు ఇనయా, శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి, రోహిత్, ఫైమా, రాజ్ నామినేషన్స్‌లో వున్నారు. వీరిలో శ్రీసత్య, శ్రీహాన్, ఇనయాలను నిన్న సేవ్ చేశారు నాగార్జున. ఇక ఆదిరెడ్డి, రోహిత్, ఫైమా, రాజ్‌లు మాత్రమే నామినేషన్స్‌లో మిగిలారు. వీరిలో రోహిత్‌ను సేవ్ చేసిన నాగ్.. ఫ్రీ ఎవిక్షన్ పాస్ ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిని ఎవరి కోసమైనా వాడతావా.?? లేదంటే నీ కోసమే వాడుకుంటావా అని ఫైమాని ప్రశ్నించారు. అయితే ఇప్పుడే దీనిపై తాను మాట్లాడలేనని, చివరికి ఇద్దరు మిగిలినప్పుడు చెబుతానని చెప్పింది. ఆ కాసేపటికే ఆదిరెడ్డి సేవ్ అవ్వగా.. ఫైమా, రాజశేఖర్‌లు మాత్రమే మిగిలారు. వీరిలో ఒకరి ఎలిమినేషన్ గ్యారెంటీ.
అనంతరం ఫైమా దగ్గర వున్న ఎవిక్షన్ పాస్ని ఎవరి కోసం వాడాలని నాగార్జున ప్రశ్నించగా... ఇంటి సభ్యులంతా అది ఫైమానే గెలుచుకుంది కాబట్టి ఆమెనే వాడుకోవాలని తేల్చిచెప్పారు. అటు రాజ్ కూడా... ప్రేక్షకులు తాను ఎలిమినేట్ కావాలని కోరుకుంటే, ఫైమా దగ్గర వున్న ఫ్రీ ఎవిక్షన్ పాస్ తనకు అక్కర్లేదని పేర్కొన్నాడు. ఫైమా కూడా ఇదే మాట చెప్పింది. కానీ నాగార్జున ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంటే బిగ్‌బాస్ ఇచ్చిన కొత్త శక్తి అని .. దానిని వాడుకోవాలని, అమ్మ ఏం చెప్పిందో గుర్తు లేదా అంటూ నాగ్ పేర్కొన్నారు. ఇక ఆ పాస్‌ను వాడటమా, లేదా అన్నది నీ ఇష్టం అని చెప్పి కింగ్ సైలెంట్ అయ్యారు.
చివరికి ఇంత మంది చెప్పడంతో ఫైమా ఆ పాస్ తానే వాడుకుంటాననే నిర్ణయానికి వచ్చింది. అనుకున్నట్లుగానే ఫైమాకు తక్కువ ఓటింగ్ రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే ఎవిక్షన్ పాస్‌ను వాడి ఫైమా సేవ్ అవ్వగా.. రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. హౌస్‌ను వీడుతూ రాజ్ కూడా కంటతడి పెట్టాడు. అనంతరం వేదిక వద్దకు రాగానే... రాజ్‌కు తన జర్నీని చూపించారు. తర్వాత ఇంటి సభ్యుల్లో హగ్ ఎవరికి ఇస్తావు, పంచ్ ఎవరికి ఇస్తావు అని అనే గేమ్ ఆడించారు నాగ్. ఈ సందర్భంగా ఫైమా, ఆది, రోహిత్, రేవంత్‌కు హగ్ ఇస్తానని... మిగిలిన నలుగురికి పంచ్ ఇస్తానని చెప్పాడు. వెళుతూ , వెళుతూ ఈ సారి విన్నర్ రేవంతేనని తేల్చిచెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com