Tirumala:దంచికొడుతున్న వానలు.. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, దర్శనం ఇంత వేగంగానా..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొన్నిరోజులుగా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్ట్‌లు సైతం నిండుకుండలా మారాయి. వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, కార్యాలయాలకు సెలవులు ఇచ్చేశారు. మరోవైపు వర్షాల ప్రభావం దేవాలయాలపైనా పడింది. ఎప్పుడు భక్తులతో కిటకటలాడే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో రద్దీ తగ్గింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.
శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం :
ప్రస్తుతం తిరుమలలోని ఆరు కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి వున్నారు. శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం మాత్రమే పడుతోంది. మంగళవారం 73,137 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీవారికి 27,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. నిన్న ఆలయానికి రూ.4.06 కోట్ల ఆదాయం లభించింది.
తెలుగు రాష్ట్రాలకు నేడు, రేపు భారీ వర్ష సూచన :
మరోవైపు.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. అటు ఏపీలోని పల్నాడు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల , పశ్చిమ గోదావరి , అల్లూరి జిల్లాలకు .. తెలంగాణలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా వుంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com