రైల్వే శాఖ కీలక నిర్ణయం.. 21 నుంచి 40 కొత్త రైళ్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారిని జనాలు కొద్దికొద్దిగా విస్మరించడం మొదలు పెట్టారు. యథావిథిగా కార్యకలాపాలన్నీ కొనసాగుతున్నాయి. కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా దాదాపు కేంద్రం అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక రైల్వే విషయానికి వస్తే.. ఇప్పటికే కొన్ని రైళ్లు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మరి కొన్ని కొత్త రైళ్లను తిప్పేందుకు సిద్ధమైంది. కొత్తగా మారో 40 క్లోన్ రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది.
సెప్టెంబర్ 12 నుంచే రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ... కొత్తగా నడపనున్న క్లోన్ ట్రైన్స్‌ను ఈ నెల 21 నుంచి పట్టాలెక్కించనుంది. అయితే వీటిలో ప్రయాణించేందుకు కొన్ని నిబంధనలను రైల్వే శాఖ పెట్టింది. ముందుగా రిజర్వేషన్ ఉంటే తప్ప ఈ క్లోన్స్ ట్రైన్స్‌లో ప్రయాణం సాధ్యపడదు. అలాగే ఈ రైళ్లు నిర్దేశించిన కొన్ని స్టాపుల్లో మాత్రమే ఆగుతాయి. అయితే కొత్తగా నడపున్న రైళ్లలో బెంగుళూరు నుంచి ధనాపూర్..ధనాపూర్ నుంచి బెంగుళూరు వెళ్లే రైళ్లు ఉన్నాయి. ఇవి విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగనున్నాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి ధనాపూర్.. ధనాపూర్ నుంచి సికింద్రాబాద్‌కూ నడవనున్నాయి. ఈ కొత్త రైళ్ల కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి కొంత మేర ప్రయోజనం చేకూరనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments