గుడ్‌న్యూస్: విశాఖకు రైల్వేజోన్ ఇచ్చిన కేంద్రం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు రైల్వేజోన్ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం రాత్రి ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ అధికారికంగా ఓ ప్రకటన రూపంలో తెలిపారు. ఈ కొత్త రైల్వేజోన్‌కు సౌత్‌కోస్ట్ రైల్వేజోన్ పేరు పెడుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు. ఈ జోన్ కింద.. గుంతకల్లు, విజయవాడ, గుంటూరు డివిజన్లు ఉంటాయన్నారు. కాగా కేంద్రం ప్రకటనతో ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా.. కేంద్ర ప్రకటనతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని చెప్పుకోవచ్చు. షెడ్యూల్ 13లోని 8వ ఆర్టికల్ ప్రకారం సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నూతన జోన్ ఏర్పాటు చేయాలని వారం క్రితం మంత్రిని కోరిన ఏపీ బీజేపీ నేతలు సాధ్యాసాధ్యాలను పరిశీలించి టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం నూతన రైల్వే జోన్‌ను ప్రకటించేసింది. కాగా.. మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రెండ్రోజుల ముందే నూతన రైల్వే జోన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే ఈ ప్రకటనపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments