ప్రపంచంలో అత్యంత చవకైన ఏసీ ప్రయాణానికి రైల్వే శాఖ ఏర్పాట్లు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏసీ రైలు అంటే కాస్ట్ మామూలుగా ఉంటుందా? ఆ ట్రైన్లో ప్రయాణించాలంటే చాలా పెద్ద మొత్తంలో రైల్వేకు చెల్లించాలి. అసలు ట్రైన్‌కు ఇంత పెద్ద మొత్తం చెల్లించే బదులు ఫ్లైట్‌కు వెళితే పోలా అనుకునే వారు లేకపోలేదు. ఎందుకంటే ఏసీ రైలు టికెట్ ధర విమాన టికెట్‌కు ఏమీ తీసిపోదు. ఇక సామాన్యులైతే ఏసీ రైలు వైపు చూసే సాహసం కూడా చేయలేరు. దాని ధర పెడితే నెల రోజులు కుటుంబమంతా హాయిగా తినొచ్చు అని భావిస్తారు. అయితే ఏసీ రైలు ప్రయాణాన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
83 బెర్తులు కలిగిన కొత్త త్రీ టైర్ ఏసీ కోచ్‌లను బుధవారం నాడు ఆవిష్కరించింది. చాలా లగ్జరీగా కనిపిస్తున్న ఈ ట్రైనులో ప్రయాణం మరింత భారమనుకుంటే పప్పులో కాలేసినట్టే. దీని ద్వారా ప్రపంచంలోనే అత్యంత చవకైన ఏసీ ప్రయాణం ప్రజల అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ కోచ్‌లోని టిక్కెట్ల ధర ప్రస్తుతమున్న ఏసీ టిక్కెట్ల ధర కంటే తక్కువగానే ఉండనుంది. అంతేకాదు.. సాధారణ స్లీపర్ కోచ్ టిక్కెట్ల ధర కంటే కాస్త ఎక్కువగా.. ఏసీ కోచ్ కంటే తక్కువగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. కొత్త కోచ్ డిజైన్‌లో భాగంగా రైల్వే పలు కీలక మార్పులు చేసింది.
ఈ రైలులో మొత్తం బెర్తుల సంఖ్యను 72 నుంచి 83కు పెంచింది. ప్రయాణికుల సౌకర్యంగా ఉండేలా డిజైన్‌లో మార్పులు చేర్పులు చేసింది. చూసే వారికి ఈ బెర్తులు చాలా లగ్జరీగా కనిపిస్తున్నాయి. ప్రతి బెర్తు వద్ద ప్రయాణికులు చదివేందుకు వీలుగా లైట్లు, చార్జింగ్ పాయింట్లను రైల్వే ఏర్పాటు చేసింది. మధ్యలో, ఎగువన ఉన్న బెర్తులను సులువుగా చేరుకునేందుకు వీలుగా నిచ్చెన డిజైన్‌ను కూడా మార్చింది. ప్రయాణికుల సౌకర్యంగా కూర్చునేందుకు వీలుగా బెర్తుల మధ్య ఖాళీ జాగాను మరింత పెంచింది. కాగా.. ఈ కోచ్ పనితీరును పరీశీలించేందుకు లక్నోలోని రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్‌లో త్వరలో పరీక్షలు నిర్వహించనున్నారు. అంతా ఓకే అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో కానీ లేదంటే ఆర్థిక సంవత్సరంలో కానీ మొత్తం 248 కోచ్‌లను ఉత్పత్తి చేయాలని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ యోచిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com