రాహుల్ విజయ్ హీరోగా SKLS గేలాక్సీ మాల్ ప్రొడక్షన్స్ నూతన చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మాయ పేరేమిటో, సూర్యకాంతం చిత్రాల ద్వారా సుపరిచితుడైన రాహుల్ విజయ్ హీరోగా SKLS గేలాక్సీ మాల్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా బృంద రవిందర్ దర్శకత్వంలో E. మోహన్ నిర్మాతగా నూతన చిత్రం రూపొందుతోంది.
జూన్ 7 హీరో రాహుల్ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి రాహుల్ విజయ్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
రాహుల్ విజయ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: ఈశ్వర్ ఎల్లుమహంతి, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: కోటగిరి వెంటేశ్వర రావు, స్టంట్స్: విజయ్, లిరిక్స్: అనంత్ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుడిమిట్ల శివ ప్రసాద్, నిర్మాత: E. మోహన్, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: బృంద రవీందర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments