చిత్రీకరణ తుది దశకు రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ చిత్రం

  • IndiaGlitz, [Tuesday,May 17 2022]

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా...అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా ప్లానింగ్ తో అనుకున్నది అనుకున్నట్లు షూటింగ్ చేసుకుంటోంది. రెండు షెడ్యూల్స్ చిత్రీకరణతో 90 శాతం రూపకల్పన పూర్తి చేసుకుంది. ఇటీవలే గోవాలో ముగిసిన రెండో షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

ఈ సందర్భంగా *నిర్మాతలు ఏ.సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ... గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మా సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. అభిమన్యు బద్ది డెబ్యూ డైెరెక్టర్ అయినా పక్కా ప్లానింగ్ తో వేసిన షెడ్యూల్స్ వేసినట్లు షూటింగ్ చేస్తున్నారు. తాజాగా గోవాలో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. దీంతో 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇదే స్పీడ్ తో సినిమాను కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

నటీనటులు - రాహుల్ విజయ్, మేఘ ఆకాష్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్,అభయ్ బెతిగంటి, వైవా హర్ష,బిగ్ బాస్ సిరి తదితరులు

More News

త‌నికెళ్ళ భ‌ర‌ణి చేతుల మీదుగా "పుడిమిని త‌డిపే తొల‌క‌రి మెరుపుల‌ చినుక‌మ్మా .. సాంగ్ విడుద‌ల‌

హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రం లో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వం లో

సాయిపల్లవికి ‘సినిమా’ కష్టాలు.. మారువేషంలో సర్కార్ వారి పాట థియేటర్‌కి, వీడియో వైరల్

సెలబ్రెటీల జీవితం విలాస వంతంగా వుంటుందని , రాచమర్యాదలు, అందమైన జీవితమేనని అంతా భావిస్తారు.

ఆ 200 మంది కౌలు రైతులే .. పోలీస్ రికార్డుల్ని చెక్ చేసుకోండి : జగన్‌కు నాదెండ్ల చురకలు

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మండిపడ్డారు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రైతులను మోసం చేయడంలో సి.బి.ఐ.

విజయ్ దేవరకొండ, సమంత 'ఖుషి' ఫస్ట్ లుక్ విడుదల

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు.

బాలయ్య చేతుల మీదుగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు... ఘనంగా ఏర్పాట్లు

పౌరాణికమైనా, సాంఘీకమైన, జానపదమైన తనదైన అద్భుతమైన నటనతో వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు