రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా కొత్త చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరో ప్రధాన పాత్రలో కొత్త చిత్రం ప్రారంభమైంది. మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమాను మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా...అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా..
హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. డియర్ మేఘ చిత్రానికి సుశాంత్, అభిమన్యుతో కలిసి పనిచేశాను. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఇది మా అమ్మ సమర్పిస్తున్న సినిమా కాబట్టి చాలా స్పెషల్ గా భావిస్తున్నా. అన్నారు
హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ.. ఇవాళ మా కొత్త చిత్రాన్ని ప్రారంభించాం. మంచి కాన్సెప్ట్ మూవీ ఇది. కూల్ రోమ్ కామ్ గా ఆకట్టుకుంటుంది. ప్యాషనేట్ టీమ్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి. అన్నారు.
మరో నటుడు అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ … ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు
నిర్మాత సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ... రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ టాలెంటెడ్ పెయిర్. వీళ్ల బెస్ట్ యాక్టింగ్ చూస్తారు. అలాగే రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇదొక రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమా. హైదరాబాద్ లో 15 రోజులు, గోవాలో 10 రోజులు షూటింగ్ చేస్తాం. మొత్తం 25 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అన్నారు.
దర్శకుడు అభిమన్యు బద్ది మాట్లాడుతూ.. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఇంట్రెస్టింగ్ గా ఉండేలా తెరకెక్కించబోతున్నాం. హీరో హీరోయిన్లతో పాటు ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమా బాగా వస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
నిర్మాత అభిషేక్ కోట మాట్లాడుతూ.. మా కోట ఫిలిం ఫ్యాక్టరీ సంస్థలో ప్రొడక్షన్ వన్ చిత్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. అన్నారు.
నటీనటులు - నటకిరీటి రాజేంద్రప్రసాద్ , రాహుల్ విజయ్, మేఘ ఆకాష్, వెన్నెల కిషోర్, అర్జున్ కళ్యాణ్ తదితరులు
సాంకేతిక నిపుణులు - సంగీతం: హరి గౌర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, పి.ఆర్.ఓ : జిఎస్ కె మీడియా, కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ, అర్ట్ డైరెక్టర్ : కే వి రమణ, నిర్మాతలు : ఏ.సుశాంత్ రెడ్డి & అభిషేక్ కోట. సమర్పణ: బిందు ఆకాష్, నిర్మాణ సంస్థలు: కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్, కథ : ఏ.సుశాంత్ రెడ్డి, దర్శకత్వం - అభిమన్యు బద్ది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com