ఇంకా ఆ స్టార్‌ హీరోలకు పాటలు పాడాలంటున్న రాహుల్‌ సిప్లిగంజ్‌

  • IndiaGlitz, [Tuesday,November 26 2019]

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ నేటి తరం అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్‌, మహేశ్‌, రాంచరణ్‌, బన్నీ సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా నువ్వు ఏ హీరో సినిమాలకు పాటలు పాడాలనుకుంటున్నావు అని ఓ రీసెంట్‌ ఇంటర్వ్యూలో అడిగితే.. మెగాస్టార్‌ చిరంజీవి, కింగ్‌ నాగార్జున, యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సినిమాల్లో పాటలు పాడాలని ఉందని ఆయన తెలిపారు. బిగ్‌బాస్‌ 3లో విజేతగా మారిన తర్వాత కొత్తగా ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? అని అడిగితే ఓ క్రేజ్‌ ఏర్పడింది. అలాగే నన్ను గౌరవంగా, వాళ్ల ఇంట్లో బిడ్డలాగా చూస్తున్నారని రాహుల్‌ తెలిపాడు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి వెళ్లిపోయిన నీ హౌస్‌ మేట్స్‌ పోటీ నుండి వైదొలిగిన సమయంలో నువ్వు ఎవరిని బాగా మిస్సయ్యావని అడిగితే వరుణ్‌ సందేశ్‌, పునర్నవి పేర్లు చెప్పాడు.

బిగ్‌బాస్‌ 3కి రాహుల్‌, పునర్నవి పెయిర్‌ మధ్య నడిచిన సన్నివేశాలను గ్రేస్‌ను పెంచాయి. ఇద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు కూడా వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే.. మా మధ్య ఏం లేదు. తను నాకు మంచి స్నేహితురాలని చెప్పిన రాహుల్‌.. తనకు ఇప్పటి వరకు ఏ అమ్మాయి ప్రపోజ్‌ చేయలేదని అన్నాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని, ఇప్పుడు వచ్చిన క్రేజ్‌ను నెక్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు తెలిపాడు రాహుల్‌.

More News

రోజాకు ఛాలెంజ్‌ విసిరిన బిగ్‌బాస్‌ 2 ఫేమ్‌

రోజా ముఖం మీద తన మనసులో మాటలను చెప్పేస్తుంటారు. కొందరు ఈమెను ఫైర్‌ బ్రాండ్‌ అని అంటే..

‘రూలర్‌' ప్రీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ నిర్మాతగా రూపొందుత్నో చిత్రం ‘రూలర్‌'.

మహా’ ట్విస్ట్.. సీఎం ఫడ్నవిస్, అజిత్ రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ రాజీనామా చేయగా..

కన్నడ చిత్రంలో కాజల్‌

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ మంచి బ్రేక్‌ కోసం వేచి చూస్తుంది. తెలుగులో ఆమె నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అ!’

మహేష్ బాబు భారీ కట్ అవుట్

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఈ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే.