కేటీఆర్ సార్.. న్యాయం చేయండి : రాహుల్ సిప్లిగంజ్

తెలుగు బిగ్‌బాస్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో కొందరు వ్యక్తులు బీరు బాటిళ్లతో దాడి చేసిన విషయం విదితమే. దాడి చేసిన వారిలో కాంగ్రెస్ తరఫున గెలిచిన టీఆర్ఎస్‌లోకి జంప్ అయిన వికారాబాద్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి అని తెలిసింది. ఈ ఘటనపై గురువారం మధ్యాహ్నం గచ్చిబౌలి పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడంతో ఆ మరుసటి రోజే ట్విట్టరెక్కిన రాహుల్.. తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌ను ట్యాగ్ చేస్తూ పబ్‌లో జరిగిన గొడవను వివరించాడు. అంతేకాదు సీసీ టీవీ ఫుటేజీని కూడా ఆ ట్వీట్‌కు జతచేశాడు.

సార్.. మీరు జోక్యం చేసుకొండి!
‘కేటీఆర్ సర్.. దీనిపై సరైన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నా. మీరు ఈ ఘటనపై స్పందించి జోక్యం చేసుకోవాలి. నేను పబ్‌లో ఎలాంటి తప్పు చేయలేదు. ఒకవేళ నా వైపు నుంచి ఎలాంటి తప్పు ఉందని తేలినా కఠిన చర్యలకైనా సిద్ధంగా ఉన్నాను. కానీ ఇక్కడ నేనో.. ఓ సామాన్యుడో ఎలాంటి తప్పు చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు చిక్కుకోవాలి.. ఎందుకు ఎదుర్కోవాలి సార్..?’ అంటూ తన ఆవేదనను ట్వీట్ రూపంలో రాసుకొచ్చాడు రాహుల్.

బతికున్నంత వరకూ పోరాడుతా!
ఆ ఒక్క ట్వీట్‌తో ఆగని ఆయన మరో ట్వీట్ కూడా చేశాడు. ‘కేటీఆర్ గారూ మీరే నాకు న్యాయం కావాలి. నేను టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేశాను.. ఓటేశాను. ఈ పార్టీ కోసమే నిలబడ్డాను. బతికున్నంత వరకు కూడా ఈ నేల కోసమే పోరాడతాను. నాకు న్యాయం జరగాలి.. నాకు మీరే చేయగలరు’ అని ట్విట్టర్‌లో రాహుల్ వేడుకున్నాడు. ఈ రెండు ట్వీట్స్‌కు రెండు వీడియోలను జతచేసిన రాహుల్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.

కేటీఆర్ నుంచి రియాక్షన్ ఉంటుందా!?
కాగా.. ఎంతైనా ఎమ్మెల్యే తమ్ముడు (బంధువు) కావడంతో బహుశా పోలీసులు కూడా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారేమో.! ఇందుకే ఇలా తనకు న్యాయం చేయరనే పోలీసులపై నమ్మకం పక్కనెట్టి.. కేటీఆర్‌కు రిక్వెస్ట్ చేసుకున్నాడని రాహుల్ సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో..? రాహుల్‌కు న్యాయం జరుగుతుందో లేదో..? అసలు ఎవరిది తప్పో..? ఎవరిది ఒప్పో ఎప్పుడు తేలుతుందో వేచి చూడాల్సిందే మరి. అయితే తనకు కష్టం వచ్చిందని.. ఆపదలో ఉన్నానని లేదా సాయం కోరి కేటీఆర్‌కు ట్వీట్ చేస్తే మాత్రం కచ్చితంగా స్పందించి తనకు తోచిన సాయం చేసే వ్యక్తి ఆయన.. మరి రాహుల్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే మరి.

More News

జూనియర్ ఆర్టిస్ట్‌ను వేధించిన లారెన్స్ తమ్ముడు!

ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ రాఘవ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

‘ఎస్ బ్యాంక్’ ఖాతాదారులకు నిర్మలమ్మ అభయం!

ప్రముఖ ‘ఎస్ బ్యాంక్’ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది.!. ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో  కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మాస్క్‌లు తయారీ కోసం ఉపాసన వీడియో చూడండి!

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

‘నిశ్శ‌బ్దం’ ట్రైల‌ర్‌ విడుద‌ల

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు

'అర్జున' 13వ తేదీకి వాయిదా

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన అర్జున చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 6న కాకుండా 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు.