డ్రగ్స్‌ని ఎప్పుడూ చూడలేదు.. తప్పంతా పబ్‌దే, ఏ టెస్ట్‌కైనా రెడీ : రాహుల్ సిప్లిగంజ్

హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ పబ్‌‌లో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు, బడా బాబుల పిల్లలు అరెస్ట్ అయినట్లు వార్తలు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ కూడా అరెస్ట్ అయినట్లు ప్రచారం జరగడంతో ఆయన స్వయంగా స్పందించారు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉండటంతోనే తాను పబ్‌కు వెళ్లానని రాహుల్ తెలిపాడు.

అసలు తనకు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదని.. డ్రగ్స్ తీసుకుంటే ఇప్పుడు ఇంట్లో ఎందుకు కూర్చుంటానని ఆయన ప్రశ్నించాడు. అడ్డంగా దొరికిపోయారు అంటూ సోషల్ మీడియాలో తమపై లేనిపోనిదంతా ప్రచారం చేయడం బాధ కలిగించిందని రాహుల్ సిప్లిగంజ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణీత సమయానికి పబ్ మూయకపోతే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి కానీ తమను ఇబ్బంది పెట్టడం సరికాదన్నాడు.

పబ్ నుంచి బయటకు వెళ్లాలంటే 40 నిమిషాలు టైం పడుతుందని.. క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్లే పబ్ నుంచి బయటకు వెళ్లడం ఆలస్యమైందని రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. రాడిసన్ క్లబ్‌కు తాను వెళ్లడం ఇది రెండోసారి మాత్రమేనని... డ్రగ్స్ తీసుకున్న వ్యవహారంపై ఎలాంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ విసిరాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వస్తే.... ఏదో చెకింగ్‌కు వచ్చారని తాము భావించామని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నాడు. మొన్నటివరకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించిన వ్యక్తినైన తాను డ్రగ్స్ ఎందుకు వాడతానని రాహుల్ ప్రశ్నించాడు.

More News

నిహారిక పబ్‌లో వున్న మాట నిజమే .. కానీ : పుడింగ్ మింక్ పబ్‌ వ్యవహారంపై నాగబాబు స్పందన

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ఆవరణలోని పుడింగ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ ఘటనలో పలువురు సెలబ్రెటీలు, సినీ ప్రముఖుల పిల్లలు పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.

బంజారాహిల్స్ రేవ్ పార్టీ.. ఆ పబ్‌లో గల్లా అశోక్ లేడు : గల్లా ఫ్యామిలీ స్టేట్‌మెంట్

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ మిగ్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు జ‌రిపిన దాడిలో

ఆ పబ్‌లో నేను లేను..  నా పేరేందుకు లాగుతున్నారు, వారి పనే : పీఎస్ వద్ద హేమ రచ్చ రచ్చ

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ ఆవరణలోని పుడింగ్ పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది.

విడుదలకు సిద్ధమైన "నో రామా రావన్స్ ఓన్లీ" మూవీ

పసివయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి" అనే సెంటిమెంట్ పాయింట్ తో సైకాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం "నో రామా రావన్స్ ఓన్లీ".

ఘోర రైలు ప్రమాదాన్ని తప్పించిన మహిళ.. చీర కొంగుతో వందల మందికి ప్రాణ భిక్ష

రైల్వే ట్రాక్‌పై నడుస్తుండగా పట్టా విరిగిపోవడమో, లేదంటే మరేదైనా కారణం వల్ల రైలు ప్రమాదంలో వుందని తెలిస్తే...