రాహుల్ రవీంద్రన్ నూతన చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల రాక్షసి చిత్రం తో మంచి పేరు సంపాదించుకుని, యంగ్ జనరేషన్ సినిమా ప్రేమికులకు దగ్గర అయిన యూత్‌ఫుల్ హీరో రాహుల్ రవీంద్రన్. వైవిద్యభరితమైన కథ ల తో మంచి సక్సెస్ ను సంపాదించుకున్న రాహుల్ త్వరలో ఒక కొత్త చిత్రం లో నటించబోతున్నాడు. లీలా టాటా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు శంషాబాద్ లో జరిగింది.
గతం లో గుణశేఖర్ వద్ద పని చేసిన రవికిరణ్ చౌదరి ఈ చిత్రం తో దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. వైష్ణవి క్రియేషన్స్ పతాకం పై, రాజేంద్ర ప్రసాద్ మరియు వెల్లాల చెరువు రవి కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే ఈ బ్యానర్ లో వస్తోన్న మొదటి సినిమా.
ఏప్రిల్ మూడవ వారం నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది అని దర్శకుడు రవికిరణ్ చౌదరి తెలిపారు. "ఇది పూర్తి వినోదాత్మకం గా సాగే కథ. ఈ చిత్రం లో ఒక కొత్త రాహుల్ రవీంద్రన్ ను చూస్తారు. మంచి హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకులు" అని ఆయన అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన వెల్లాల చెరువు రవి కుమార్ మాట్లాడుతూ, " చిత్రం కథ చాలా బాగా వచ్చింది. భారీ తారాగణం తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం . మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అని అన్నారు.
కథ - మాటలు - రాజేంద్ర ప్రసాద్, దర్శకత్వం - స్క్రీన్‌ప్లే - రవికిరణ్ చౌదరి . ఆర్ట్ - రాజ్ కుమార్, .సినిమాటోగ్రఫీ - దేవేందర్ రెడ్డి . సంగీతం - శేఖర్ చంద్ర . నిర్మాతలు - రాజేంద్ర ప్రసాద్ , వెల్లాల చెరువు రవి కుమార్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com