రాహుల్ రవీంద్ర హీరోగా శోభన్ బాబు సినిమా ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అలరించి.. అందాల కథానాయకుడుగా ప్రేక్షక హ్రుదయాల్లో సుస్ధిరస్ధానం సంపాదించుకున్న హీరో కీ.శే. శోభన్ బాబు. వెండితెర సోగ్గాడుగా పాపులర్ అయిన శోభన్ బాబు పేరుతో ఓ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ హీరోగా నటిస్తున్నారు. విప్లవ్ .కె స్వీయదర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. విజయ దశమి పండుగ పురష్కరించుకొని ఈ చిత్రాన్ని ఫిలింనగర్ ఆఫీస్ లో ప్రారంభించారు.
ఒక రొమాంటిక్ కామెడీగా రుపొందబోతున్నఈ సినిమాలో రాహుల్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటిస్తున్నారు. నవంబర్ రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం రమణగోగుల అందిస్తున్నారని దర్శక నిర్మాత విప్లవ్ తెలిపారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : భరణి.కె.ధరన్, కూర్పు : ధర్మేంద్ర కాకరాల,సాహిత్యం :భాస్కరబట్ల, కళ : ధర్మేంద్ర , కాస్ట్యూమ్ డిజైనర్ : దేవి ఐశ్వర్య , లైన్ ప్రొడ్యూసర్ : C.H.V.S.N బాబ్జీ, నిర్మాణం :సాలగ్రామ్ సినిమా, రచన-దర్శకత్వం : విప్లవ్ .కె
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments