'మిఠాయి' పై రాహుల్ రామకృష్ణ పిచ్చి ట్వీట్స్..
- IndiaGlitz, [Saturday,February 23 2019]
టాలీవుడ్లో విజయదేవరకొండ 'అర్జున్‌రెడ్డి', 'గీత గోవిందం' మూవీలతో ఎంత పేరు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండే రెండు సినిమాలతో టాప్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అయితే ఆ రెండు సినిమాల్లో విజయ్‌తో పాటు నటించిన రాహుల్ రామకృష్ణ పేరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మార్మోగింది. అంతేకాదు గీత గోవిందంలో ప్రియదర్శి కూడా తన పాత్రకు న్యాయం చేసి ఆ యాసతో సినీ ప్రియులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే ప్రియదర్శి, రాహుల్ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ‘మిఠాయి’. శుక్రవారం అభిమానుల ముందకు వచ్చిన ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
చెత్త సినిమా..!
'మిఠాయి' సినిమా టైటిల్ చూసి థియేటర్లకు వెళ్లిన అభిమానులు, సినిప్రియులు ఎంతో కమ్మగా.. హాయిగా నవ్వుకోచ్చని వెళ్లి.. చూసిన చాలా మంది చెత్త సినిమా చూసిన ఫీలింగుతో బయటకు రావడం గమనార్హం. సినిమాకు వచ్చిన కొంత మంది ‘హిఠాయి'ని ఇంటర్వెల్ వరకు కూడా భరించలేక వెళ్లిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో మిఠాయి కాస్త జనాల్లో చేదుగా మారిపోయినట్లైంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ వేదికగా రియాక్టయ్యాడు.
ట్వీట్ సారాంశం ఇదీ..
'మిఠాయి' లాంటి సినిమా చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను.. ఈ సందర్భంగా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను. సినిమాను రిపేరు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం కానీ అవేమీ ఫలించలేదు. కామెడీ చేయడం అంటే సులువైన జాబ్ కాదని, తిరిగి ప్రేక్షకుల ఆదరణ చూరగొంటాను. ఈ సినిమా చూసిన మీరంతా నిన్న నన్ను తిట్టుకొని ఉంటారు అని ఇక పై ఇలాంటి సినిమాలకు దూరంగా ఉంటానని పరోక్షంగా ఆయన ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్స్‌కు పలువురు అభిమానులు, నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడంతో సమాధానం చెప్పుకోలేక.. మిన్నకుండిపోయాడు. అంతేకాదు ట్విట్టర్ అకౌంట్‌ను క్లోజ్ చేసుకోవడం గమనార్హం.
పిచ్చి ట్వీట్స్ మానండి.. ఫ్యూచర్ ఉంది!
మనిషి అనగా గెలుపోటములు సహజమే. ముఖ్యంగా సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలు ప్లాప్‌లు ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్స్ కొట్టిన రోజులున్నాయ్. గట్టిగా ప్రయత్నం చేస్తే సక్సెస్ కావడం పక్కా.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంతే తప్ప ఒక సినిమా సక్సెస్ కాలేకపోయింది.. అని ఇలా సినిమాలో నటించిన తమరే ఇలా పిచ్చిపిచ్చిగా ట్వీట్స్ చేసి మిఠాయిని కాస్త చేదు చేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మీ ట్వీట్స్ వల్ల సినిమాల్లో నటించిన వారు.. తెరకెక్కించన వారు.. నిర్మించిన వారు ఎలా ఫీలవుతారని ఒకే ఒక్క నిమిషం అయినా ఆలోచించారా..? సో తప్పులు దొర్లుతాయ్ కానీ.. దెబ్బలు తిన్నోడే రేపొద్దున్నే స్ట్రాంగ్‌గా కొట్టగలడు.. అంతే. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు రాహుల్ రామకృష్ణ.. ఇది తమరికి తోచిందని చేశారో.. లేకుంటే ఎవరైనా ఇలా చెయ్ అని తమరికి పిచ్చి సలహా ఇచ్చారో తెలియదు కానీ మరోసారి రిపీట్ కాకుండా చూస్కోండి.. మీకు మంచి ఫ్యూచర్ ఉంది అని సినీ విశ్లేషకులు, విమర్శకులు సూచిస్తున్నారు.