అషురెడ్డికి ముద్దిచ్చిన రాహుల్.. లవ్ అనౌన్స్మెంట్!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచాడు. ఆ సీజన్ లో శ్రీముఖి, రాహుల్ పోటాపోటీగా తలపడ్డారు. కానీ చివరకు రాహుల్ నే విజయం వరించింది. దీనితో రాహుల్ పాపులారిటీ బాగా పెరిగింది. ప్రస్తుతం రాహుల్ అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో పాటలు పాడుతున్నాడు. తాను సొంతం మ్యూజిక్ అల్బర్స్ కూడా చేస్తున్నాడు.
ఇదీ చదవండి: PSPK28: అలెర్ట్ అయిన టీమ్.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
తాజాగా రాహుల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అదే సీజన్ లో యంగ్ బ్యూటీ అషు రెడ్డి కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అషురెడ్డికి రాహుల్ ముద్దిస్తున్న పిక్ పోస్ట్ చేశాడు. దానికి లవ్ అనౌన్స్మెంట్ అని కామెంట్ పెట్టాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రాహుల్, అషురెడ్డి నిజంగానే ప్రేమలో ఉన్నారా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇది రాహుల్ పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. రాహుల్ తన మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ ల కోసం ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ గతంలో కూడా చేశాడు. ఓ షూట్ కోసం పునర్నవితో పెళ్లి అనే రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు.
దీనితో రాహుల్, అషురెడ్డి నిజంగానే ప్రేమలో ఉన్నారా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. రాహుల్.. అషురెడ్డికి ముద్దిస్తున్న ప్లేస్ కూడా షూట్ కోసం రెడీ చేసిన సెట్ ని తలపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments