నేటి నుంచి 'భారత్ జోడో న్యాయ యాత్ర'కు రాహుల్ గాంధీ శ్రీకారం
Send us your feedback to audioarticles@vaarta.com
'భారత్ జోడో న్యాయ యాత్ర’కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి నుంచి శ్రీకారం చుట్టారు. మణిపుర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ముంబైలో ముగుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ నాయకురాలు షర్మిల, ఇతర అగ్ర నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యాత్రలో రాహుల్ 6,713 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లను 67 రోజుల్లో పూర్తి చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో నిరుద్యోగం, ధరలు పెరుగుదల, పేదరికం, సామాన్యులకు తోడుగా, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రస్తావించనున్నారు.
లోక్‌సభ ఎన్నికలే టార్గెట్..
గత భారత్ జోడో యాత్రలో రాహుల్ పాదయాత్ర చేశారు. ఈసారి పాదయాత్రతో పాటు వాహనాల్లోనూ చేపడతారు. లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా ఈ యాత్ర సాగనుంది. అయితే భారత్ జోడో యాత్ర వల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కొంత బలపడింది అని ఆ పార్టీ నాయకులతో పాటు విశ్లేషకులు బలంగా నమ్మారు. ఎందుకంటే ఆ యాత్ర ముగిసిన వెంటనే జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి కూడా ఈ యాత్ర బాగా పనిచేసిందని భావించారు. అలాగే తెలంగాణలో కూడా ప్రభుత్వంలోకి రావడానికి ఇది దోహపడిందని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కోల్పోవడంతో పాటు మధ్యప్రదేశ్‌లోనూ ఓటమిపాలు కావడంతో ఈ యాత్ర ప్రభావం దేశమంతటా లేదని నిరూపితమైందని అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ లక్ష్యం నెరవేరుతుందా..?
అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టారంటున్నారు. ఓవైపు దేశంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పెరగడం, ప్రధాని మోదీ మేనియా ఆకాశమంతా పెరిగాయి. మరోవైపు హిందూవు చిరకాల కల అయిన అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి తరుణంలో రాహుల్ యాత్రతో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరుతుందో లేదో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. కాగా 2022 సెప్టెంబరు 7వతేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర మొదటి దశ జనవరి 2023లో జమ్మూ, కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసిన సంగతి తెలిసిందే. 12 రాష్ట్రాల్లో 75 జిల్లాల మీదుగా 4,080 కిలోమీటర్లు ఈ యాత్ర సాగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com