Rahul Gandhi:రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ.. ఒక్కరోజే ఐదు చోట్ల ప్రచారం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ తుది ప్రచారాన్ని హోరెత్తించనుంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం తెలంగాణకు రానున్నారు. రేపు(శుక్రవారం) ఒక్కరోజే ఏకంగా 5 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న రాహుల్.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఉదయం 11 గంటలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాకకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు.
అనంతరం పినపాక నుంచి నర్సంపేటకు రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు అక్కడ ప్రచారం చేపట్టనున్నారు. తదుపరి నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి చేరుకోనున్న రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. తర్వాత వెస్ట్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. ఇక చివరగా సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ రానున్నారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగలో సభలో పాల్గొని ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఇక పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రేపు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి ఖర్గే చేరుకోనున్నారు. అక్కడి నుంచి గాంధీ భవన్‌కు చేరుకొని 11 గంటలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొని ప్రసగించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout