హెలికాప్టర్ రిపేర్ చేసిన రాహుల్ గాంధీ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏమైనా మెకానికా..? హెలికప్టర్ రిపేర్ చేయడానికి అని ఆశ్చర్యపోతున్నారా..? మీరు వింటున్నది నిజమే. రాహుల్ 'మెకానిక్ మావయ్య'.. 'మెకానిక్ అల్లుడు' లా మారిపోయారు.! ఇటీవల రాహుల్ పర్యటనలో భాగంగా తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రిపేర్‌కు వచ్చింది. సిబ్బంది అంతా కిందికి దిగి రిపేర్ చేయడానికి సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ కూడా తనవంతుగా సిబ్బందికి సాయం చేస్తూ ఓ ఫొటోకు పోజిచ్చారు.
నెట్టింట్లో వైరల్..
ఆ ఫొటోకు 'మంచి టీం వర్క్ అంటే అన్ని చేతులు కలిసి పనిచేయడమే. ఉనా పర్యటన సమయంలో మా హెలికాప్టర్లో సమస్య ఎదురైంది. మేమంతా కలిసి దాన్ని త్వరగా సరిచేశాం. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు' అని క్యాప్షన్ ఇచ్చి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫిక్ చూసిన రాహుల్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు లైక్స్ చేసి పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సిబ్బందితో పాటు రాహుల్ కూడా ఓ చెయ్యేసి రిపేర్ చేశారు. అయితే హెలికాప్టర్ కిందికి దూరి మరీ రిపేర్ చేయడం విశేషమని చెప్పుకోవచ్చు.
ఇదేం కొత్తకాదు..!
కాగా.. రాహుల్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తని రోజులు ఏమైనా ఉన్నాయా..? అంటే దాదాపు లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు రాహుల్ హెలికాప్టర్‌కు సాంకేతిక సమస్య వచ్చింది.. రాహుల్ హెలికాప్టర్ హఠాత్తుగా ల్యాండ్ అయ్యింది.. ఇలా చాలా సార్లు వార్తలు మనందరం వినే ఉంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే రాహుల్ హెలికాప్టర్ ఇలా రిపేర్‌కు రావడం ఇవాళ కొత్తేం కాదు. ఆ హెలికాప్టర్ మార్చండి రాహుల్ జీ అని ఆయన అనుచరులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సలహాలు, సూచనలిస్తున్నారు. బహుశా రాహుల్‌కు ఈ హెలికాప్టర్ అచ్చొచ్చిందేమో గానీ ఆయన మాత్రం దీన్ని వదిలేలా లేరు.!
గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం..
నంద్యాల లోక్ సభ స్థానం నుంచి ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారన్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు. ఒక్క రూపాయికి పప్పు, రొట్టె, ఒక్క రూపాయికి మజ్జిగ, ఒక్క రూపాయి అద్దెతో సాగునీటి సరఫరాకు పీవీసీ పైపు, బిందు సేద్యానికి సగం ధరకే సామగ్రి అందించడం మామూలు విషయం కాదని ఎస్పీవై రెడ్డి సేవలను కొనియాడారు. ఒక పారిశ్రామికవేత్త అలా చేయడం గొప్ప విషయమన్నారు. అందుకే ఆయన రైతు పక్షపాతిగా ప్రజల మనసుల్లో ఆయన చెరగని ముద్ర వేశారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని భరోసా ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments