Rahul Gandhi:రాయ్‌బరేలీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

  • IndiaGlitz, [Friday,May 03 2024]

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాయ్‌బరేలి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాహుల్ వెంట ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు. మరోవైపు అమేథీ లోక్‌సభ స్థానానికి కిషోర్ లాల్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు.

కాగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలు గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్నాయి. అమేథీ స్థానంలో 2004 నుంచి 2019 వరకు రాహుల్ గాంధీ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇక రాయ్‌బరేలీ స్థానంలో 1952 నుంచి 2024వరకు గాంధీ కుటుంబమే ప్రాతినిథ్యం వహిస్తుంది. గతంలో ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఇక్కడి నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం అనారోగ్యం కారణంగా సోనియా పోటీ నుంచి తప్పుకున్నారు.

దీంతో ప్రియాంక గాంధీ వాద్రాను రాయ్‌బరేలీ నుంచి పోటీకి దింపుతారని అందరూ భావించారు. అయితే రాహుల్ వైపే మొగ్గు చూపారు. గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన ఈ రెండు స్థానాలకు 5వ విడతలో భాగంగా మే 20న పోలింగ్ జరగనుంది. అయితే ఇక్కడ అభ్యర్థులను ప్రకటించడంలో చివరి నిమిషం వరకు వాయిదా వేసింది. నామినేషన్లకు ఇవాళే చివరి తేదీ కావడంతో ఉదయం అభ్యర్థులను ప్రకటించింది. దీంతో రాహుల్ గాంధీ, కిషోర్ లాల్ శర్మ నామినేషన్లు సమర్పించారు.

కాగా రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ ముసింది. 2019లో వయనాడ్, అమేథీ నుంచి రాహుల్ పోటీ చేశారు. అమేథీలో ఓడిపోగా... వయనాడ్‌లో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. మరోవైపు ఉంటే రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. వయనాడ్‌లో ఓడిపోతారనే భయంతో రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నారని విమర్శించారు.

More News

Telangana Congress;లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల

లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. 'ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు' పేరుతో టీ కాంగ్రెస్ రూపొందించింది.

Mudragada Daughter:ముద్రగడకు ఊహించని షాక్ ఇచ్చిన కూతురు.. పవన్ కల్యాణ్‌కు మద్దతు..

ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న స్థానం పిఠాపురం.

Avinash Reddy:వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డికి భారీ ఊరట

ఏపీ ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ

MLC Notification: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఓవైపు పార్లమెంట్ ఎన్నికల హడావిడి నడుస్తుంటే.. మరోవైపు వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Voters in AP: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఈ నియోజకవర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్..

ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని.. సర్వీస్ ఓటర్లు 65,707గా ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు.